'చంద్రబాబూ ఇక రాకు!': భూమన

హైదరాబాద్ :‌

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి కోసం ఆ పార్టీ కొత్తగా చేస్తున్న 'బ్రింగ్ బ్యా‌క్ బాబు' ప్రచారంపై వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాక‌ర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ వాయిదా అనంతరం శనివారంనాడు భూమన మీడియా పాయింట్ వద్ద విలే‌కరులతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడిది రాక్షస పాలని అని, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ప్రజలకు ఏం చేశారని ఇప్పుడు మళ్ళీ అధికారం అప్పగించాలని భూమన నిలదీశారు. గతంలో ప్రజలు దెయ్యం భయంతో 'ఓ స్త్రీ రేపు రా' అని రాసుకునేవారని, ఇప్పుడు 'చంద్రబాబూ నువ్విక రాకు' అనే పరిస్థితులు వచ్చాయని భూమన ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడి దుష్టపాలన మళ్లీ రాకూడదని ప్రజలు పూజలు చేస్తున్నారని పేర్కొన్నారు.

అసెంబ్లీలో 77, 78 నిబంధనల కింద సమైక్య తీర్మానం చేయాలని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌తొలి నుంచీ పట్టుపడుతోందని కరుణాకరరెడ్డి గుర్తు చేశారు. కాగా శనివారం ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే విభజన బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలంటూ వై‌యస్ఆర్‌సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీనితో పార్టీ సభ్యులు స్పీకర్ పోడి‌యాన్ని చుట్టుముట్టి, నిరసన తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top