వైయస్‌ఆర్‌ ఆలోచనలే మా పార్టీ సిద్ధాంతం

దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆలోచనలే మా పార్టీ విధానాలని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. సిద్దాంతం లేదని విమర్శించే వారికి ఇదే మా సమాధానమన్నారు. రాజకీయం అంటే అధికారం అనే సిద్ధాంతం చంద్రబాబుది అన్నారు. జీవితాంతం గర్వపడేలా చెప్పుకునే నాయకుడు వైయస్‌ జగన్‌ అన్నారు. అధికారం ఒకరు వేస్తే తీసుకునే భిక్ష కాదని, పోరాడి సాధించుకునే హక్కు అన్న వ్యక్తి వైయస్‌ జగన్‌ అని గుర్తు చేశారు. 10 జన్‌పథక్షలో నిటారుగా నిలబడ్డ వ్యక్తి వైయస్‌ జగన్‌ అన్నారు. వందసార్లు కుంగదీయాలని ప్రయత్నించినా లొంగని మనిషి వైయస్‌ జగన్‌ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం కాదు..తన తండ్రి ఆశయ సాధన కోసం వైయస్‌ జగన్‌ పోరాటం చేస్తున్నారని చెప్పారు. అటువంటి నేతకు మనం చేదోడు వాదోడుగా ఉందామని భూమన పిలుపునిచ్చారు. ఐదు కోట్ల ఆంధ్రులకు వైయస్‌ఆర్‌ పాలన అందిద్దామని అన్నారు. 

Back to Top