బాబు, మోదీలు ప్రజా ద్రోహులు
 గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చం‍ద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీలు ప్రజా ద్రోహులుగా మిగిలిపోతారని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి విమర్శించారు. గురువారం గుంటూరులో తలపెట్టిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 600 హామీలిచ్చిన చం‍ద్రబాబు ఏ ఒక్కటీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ జీవితం వంచనతోనే ప్రారంభమైందని ఆయన ఎద్దేవా చేశారు. నాలుగేళ్లుగా చంద్రబాబు చేస్తున్న వంచన, మోసం, దగాకు వ్యతిరేకంగానే వంచనపై గర్జన దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు చేస్తున్న వంచనను ప్రజలకు చెప్పడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏపీకి హోదా అవసరం లేదన్నట్లుగా చంద్రబాబు, మోదీలు వ్యవహరిస్తున్నారని అన్నారు.వైయ‌స్ జ‌గ‌న్‌తోనే ప్ర‌త్యేక హోదా సాధ్య‌మ‌ని, అందుకోసం అంద‌రూం క‌లిసి పోరాటం చేద్దామ‌ని పిలుపునిచ్చారు.
Back to Top