ప్రత్యేకహోదాపై గందరగోళం సృష్టించొద్దు..!

ప్రత్యేక హోదా సాధించడం పెద్ద కష్టమేమీ కాదని డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. కేంద్రపెద్దలు తలుచుకుంటే పని సులభమవుతుంద్నారు. దీనిపై అందరూ కలిసికట్టుగా ఉండి సాధించుకోవాలన్నారు. కొత్తరాష్ట్రానికి రాజధానితో పాటు కీలకమైన సంస్థలు, పరిశ్రమలు, హాస్పిటల్ లు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్పెషల్ స్టేటస్ ఎంత ముఖ్యమో గ్రామస్థాయిలో ప్రతిఒక్కరూ గుర్తించారని చెప్పారు.

ప్రత్యేకహోదాపై అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు కన్ఫ్యూజన్ కు గురిచేస్తున్నారని రాజేంద్రనాథ్ అన్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని రాజేంద్రనాథ్ కోరారు. భూములు, పోలవరం సహా అనేక అంశాల్లో మనకు ఉన్న వెసులుబాటును గుర్తించకుండా ధిక్కరిస్తున్నారని ఆరోపించారు. స్పెషల్ స్టేటస్ పై ప్రభుత్వం ఆడుతున్న నాటకానికి సంబంధించి చివరగా పచ్చసెంట్ కథ చెప్పి ఎత్తిపొడిచారు. 

తాజా ఫోటోలు

Back to Top