వైయస్ఆర్ కు భారతరత్న ఇవ్వాలి

  • గిద్దలూరు పార్టీ ప్లీనరీలో తీర్మానం
  • అందరి అభ్యున్నతికి పాటుపడిన మహానేత
  • భారతరత్న ఇచ్చి గౌరవించాలని ప్రజాభిప్రాయం
  • కొడుక్కి మంత్రి పదవికోసం అడ్డదారులు తొక్కిన బాబు
  • గిద్దలూరు ఇంచార్జి ఐవీరెడ్డి
గిద్దలూరు:  తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం మీద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినన్ని సంక్షేమ పథకాలను ఏ ముఖ్యమంత్రీ ప్రవేశపెట్టలేదని ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ వైయస్సార్సీపీ ఇన్ చార్జి ఐవీ రెడ్డి అన్నారు. ఓ అవ్వ, తాతనో అడిగితే ఆరోగ్యశ్రీ పథకం తమ  పేద గుండెలకు ఎంత మంచి చేసిందో చెబుతారని, హైదరాబాద్, బెంగళూరు, పుణె లాంటి నగరాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న యువకులను అడిగితే ఫీజు రీయింబర్స్ మెంట్ తమకు ఎలా దారి చూపించిందో, తమ జీవితాలను ఎలా చక్కదిద్దిందో చెబుతారని ఆయన పేర్కొన్నారు. ఇంతటి బ్రహ్మాండమైన పథకాలు అనేకం ప్రవేశపెట్టి, వాటిని దిగ్విజయంగా అమలుచేసిన దివంగత మహానేత వైఎయస్ఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

పార్టీ ప్లీనరీ సమావేశ సందర్భంగా ఆయన ఈ మేరకు ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. దాన్ని నాయకులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. తారతమ్యం లేకుండా అందరి అభ్యున్నతికి పాటు పడి తన పాలనలో ప్రతి ఒక్కరు సంతోషంగా జీవించాలనే ఉన్నత ఆశయంతో సేవ చేసిన రాజశేఖరరెడ్డికి భారతరత్న ఇచ్చి గౌరవించాలని, ప్రజలంతా కోరుకుంటున్న ఈ విషయాన్ని తాను ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నానని ఐవీ రెడ్డి తెలిపారు. వైయస్ పాలనలో రైతన్నల మేలు కోసం తలపెట్టిన ఎన్నో ప్రాజెక్టులు ప్రస్తుతం మరుగున పడి నిర్వీర్యం అవుతున్నాయని, 108 సక్రమంగా పనిచేయక ప్రమాదాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల క్షేమం కన్నా తన కుటుంబ సభ్యుల క్షేమమే ముఖ్యమని చంద్రబాబు కొడుక్కి మంత్రి పదవి దక్కడం కోసం ఎంత అడ్డదారులు తొక్కారో అందరికి తెలిసిన చరిత్రేనని విమర్శించారు.
Back to Top