బెయిలు రాకుండానూ కుయుక్తులు

ఉదయగిరి:

వైయస్ఆర్‌ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి విడుదల కోరుతూ స్థానిక శాసన సభ్యుడు మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో సీతారామపురం, ఉదయగిరిలో సంతకాలను  సేకరించారు. తొలుత  దేవలాలగడ్డ, బీసీ కాలనీల్లో ఆయన పాల్గొని ‘జనం సంతకం’ పేరుతో సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ కోటి సంతకాలను సేకరించిన అనంతరం వాటిని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి అందజేస్తామన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుట్రల కారణంగానే జగన్‌మోహన్‌రెడ్డి  జైల్లోనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన విడుదలైతే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కనుమరుగవుతాయనే భయంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్నారు. ఇప్పటికే దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుటుంబ సభ్యులు జనం గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నారన్నారు. శ్రీ జగన్మోహన్‌ రెడ్డిని  రాజకీయంగా ఎదుర్కోలేక టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై జైలుపాలుచేసి బెయిలు రాకుం డా ఎన్నో కుయుక్తులు పన్నుతూ కాలం వెళ్లదీస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి దుశ్చర్యలు చేయడం తగదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి విడుదల కోసం రాష్ట్ర ప్రజలతోపాటు దేశ విదేశాల్లో ఉన్న వైయస్ఆర్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారన్నారు.

     కాంగ్రెస్, టీడీపీ సీబీఐని అడ్డుపెట్టుకొని బెయిలురాకుండా చేస్తున్నాయన్నారు. ప్రతి మండలానికి పది వేల వంతున సంతకాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే అక్రమ కేసు బనాయించారన్నారు. ప్రజాదరణ కలిగిన శ్రీ జగన్మోహన్‌రెడ్డి త్వరలోనే బయటకు వస్తారని, సీఎం కావడం తథ్యమన్నారు. శ్రీ జగన్‌ విడుదల కోసం కోటి సంతకాల సేకరణను కార్యకర్తలందరూ సైనికుల్లా పనిచేసి చిత్తశుద్ధితో పూర్తిచేయాలన్నారు.

Back to Top