ప్రైవేటుపరం చేసే చర్యలు మానుకోవాలి

  • బాబు అసమర్థ ముఖ్యమంత్రి..రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు
  • పేదవాడి ఆరోగ్యాన్ని బాబు పూర్తిగా విస్మరించారు
  • ప్రభుత్వాసుపత్రులను ప్రైవేటుపరం చేసే చర్యలు మానుకోవాలి
  • పేదలకు ఉచిత వైద్యం అందించిన ఘన చరిత్ర వైయస్సార్ ది
  • వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి

హైదరాబాద్ః చంద్రబాబు సర్కార్ పేదవాడి ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరించిందని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ సరిగా లేనందున వాటిని ప్రైవేటు ఆస్పత్రులకు కట్టబెడుతున్నామని చెప్పడం దుర్మార్గమని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.  అలా అప్పగించడాన్ని వైయస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. వెంటనే ఆ ఆలోచన మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ భూమన ఏమన్నారంటే.......

  • చంద్రబాబు పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.
  • ప్రభుత్వాసుపత్రులను కార్పొరేట్ యాజమాన్యాలకు కట్టబెట్టాలన్న దుర్నీతితో బాబు వ్యవహరిస్తున్నారు 
  • ప్రభుత్వాసుపత్రుల నిర్వహణ సరిగా లేదనడమంటే అది బాబు అసమర్థతే అవుతుంది. 
  • రాష్ట్రాన్ని పాలించే  అర్హుత బాబుకు లేదు. 
  • ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలకు మేలు చేయాలన్న కుట్రతోనే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు లేకుండా చేయాలని చూస్తున్నారు
  • గతంలో వరల్డ్ బ్యాంక్ ఆదేశానుసారం ప్రభుత్వ నిర్వహణలో నడుస్తున్న ఆస్పత్రులపై యూజర్ ఛార్జీలు విధించి వసూల్ చేసిన ఘనత బాబుది. 
  • మహానేత  వైయస్. రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక... యూజర్ ఛార్జీలు, సేవా రుసుములను తీసేయడమే గాకుండా ప్రభుత్వ ఆధీనంలోని ఆరోగ్యకేంద్రాలన్నంటికీ సరైన ఆరోగ్యం చేకూరేలా పరిపాలన సాగించారు.
  • నేను మారాను అంటూ అమలు గాని హామీలతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన నిజస్వరూపాన్ని మరోసారి బయటపెట్టుకున్నాడు
  •  పట్టణ ఆరోగ్య కేంద్రాలన్నంటినీ ప్రైవేటుపరం చేస్తున్నాననడం దారుణం. 
  • భవిష్యత్తులో మొత్తం ఆస్పత్రులను ప్రైవేటుకు దత్తత ఇచ్చే కార్యక్రమం చేస్తున్న బాబు దుర్నీతిని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 
  • పేదల ఆరోగ్యం కోసమని ఆరోగ్యశ్రీ స్థాపించి వారికి ఉచిత వైద్యాన్ని అందించిన ఘన చరిత్ర వైయస్ రాజశేఖర్ రెడ్డిది. 
  • బాబు ప్రభుత్వ ఆస్పత్రులను నిర్వీర్తం చేయాలని చూస్తే.... వైయస్సార్ వాటికి బలం చేకూర్చే ప్రయత్నం చేస్తూ పేదలకు కార్పొరేట్ వైద్యం అందించారు. 
  • రాష్ట్రంలోని ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలను మూసివేసే విధంగా పేదల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్న బాబు.. ఆరోగ్యం విషయంలో కూడా అదే పనికి పూనుకోవడం దుర్మార్గం. 
  • పేదవాడి ఆరోగ్యం గగనకుసుమంగా మారేలా చేస్తున్నారు. 
  • బాబు మేకవన్నె పులి. సంక్షేమ పథకాలన్నింటినీ తుడిచి పెట్టేస్తున్నారు. 
  • బడా బడా పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేస్తున్నాడు.
  • చంద్రబాబు అట్టడుగు పేద ప్రజల బాగోగులు గల నాయకుడు కాదు.
  • వైయస్సార్ ఉచిత విద్యుత్ ఇస్తామంటే బాబు తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆరోగ్య శ్రీని కూడా వ్యతిరేకించాడు. 
  • వందలాది హామీలు గుప్పించి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా బాబు ప్రజలను మోసం చేస్తున్నాడు. 
  • చివరకు ప్రజారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా చెలగాటమాడుతున్నారు.
  • బాబు తన వైఖరి మార్చుకోకపోతే ఉద్యమాలు తప్పవు. 
  • బాబు ప్రజాద్రోహి. నాకంటే ఘనడు మరొకరు లేరని ఊహల్లో బతికే మాయలోడు. 
  • అమరావతిని అమరపురిలా మారుస్తానంటూ మాయమాటలతో ప్రజలను వంచిస్తున్నాడు.
  • బాబు పాలనలో ఆరోగ్యం వ్యాపారంగా మారింది. ప్రజాభద్రత కొరవడింది. 
  • బాబు వన్నీ ప్రజాకంఠక, ప్రజావ్యతిరేక నిర్ణయాలు. 
  • ప్రపంచబ్యాంకు ఒత్తిళ్లకు లొంగి గతంలో 50 కిలోమీటర్లకు ఓ టోల్ గేట్ పెట్టి ముక్కుపిండి ఛార్జీలు వసూలు చేశారు
  • ప్రజాసంక్షేమాన్ని కోరుకునే దేశాలన్నీ ఆరోగ్యం, విద్యను  బాధ్యతగా తీసుకుంటే...బాబు ప్రైవేటు వాళ్లకు అప్పగించడమే నా బాధ్యత అంటున్నాడు.
  • ప్రభుత్వాసుపత్రులను ప్రైవేటుపరం చేయాలని చూస్తే  ప్రజాపోరాటాలు తప్పవని హెచ్చరిస్తున్నాం. 

Back to Top