పదవి కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు

రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా పట్టించుకోని బాబు
కేసీఆర్ ను తిడితే పదవి పోతుందని భయం
దోచుకున్న సొమ్ము దాచుకునేందుకు విదేశాలకు
రాష్ట్రహక్కులు కాపాడుకునేందుకే వైయస్ జగన్ జలదీక్ష
ఎన్ని పోరాటాలు చేసైనా అక్రమ ప్రాజెక్ట్ లను అడ్డుకుంటాంః ఎమ్మెల్యేలు

క‌ర్నూలుః  కేసీఆర్ కు వ్య‌తిరేకంగా మాట్లాడితే ప‌ద‌వి పోతుంద‌న్న భ‌యంతోనే చంద్ర‌బాబు నోరు మెడ‌ప‌డం లేద‌ని వైయ‌స్ఆర్ సీపీ పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమ‌ర్శించారు. తెలంగాణ ప్ర‌భుత్వం అక్రమ  ప్రాజెక్టుల‌కు వ్య‌తిరేకంగా వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన దీక్షా ప్రాంగ‌ణంలో ఆయ‌న మాట్లాడారు. తెలంగాణ ప్ర‌భుత్వం అక్ర‌మంగా నీటిని తోడుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా చంద్ర‌బాబు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు. ఓటుకు నోటు కేసులో ప్ర‌ధాన ముద్దాయి కాబ‌ట్టే చంద్రబాబు కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా మాట్ల‌డ‌డం లేద‌ని ఆరోపించారు. చంద్ర‌బాబు ఆంధ్ర‌రాష్ట్రాన్ని కేంద్ర‌ం, తెలంగాణ ప్ర‌భుత్వాల‌కు తాక‌ట్టు పెట్టార‌ని ఫైరయ్యారు. పాల‌మూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల‌కు వ్య‌తిరేకంగా రైతుల ప‌క్షాన నిల‌బ‌డేందుకే వైయ‌స్ జ‌గ‌న్ ముందుకు వ‌చ్చి జ‌ల‌దీక్ష చేప‌ట్టారని చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్తానికి తెలిసేలా ఈ మూడు రోజులు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయ‌ని పేర్కొన్నారు.

తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల‌తో రాష్ట్రానికి అన్యాయం జ‌రుగుతున్నా ప‌ట్టించుకోకుండా ....దోచుకున్న సొమ్మును దాచుకునేందుకు బాబు సింగ‌పూర్‌, జ‌పాన్ అంటూ విదేశాలు తిరుగుతున్నార‌ని వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి మండిప‌డ్డారు. పాల‌మూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల‌తో ఏపీకి  అన్యాయం జ‌రుగుతుందనే  వైయ‌స్ జ‌గ‌న్‌ జ‌ల‌దీక్ష‌కు పూనుకున్నార‌ని స్ప‌ష్టం చేశారు. క‌ర్నూలు జ‌ల‌దీక్ష ప్రాంగ‌ణం వ‌ద్ద ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి రాయ‌ల‌సీమ ప్రాంత ప్ర‌జ‌ల కోసం గాలేరు-న‌గ‌రి, హంద్రీ-నీవా, వెలుగొండ ప్రాజెక్టుల‌ను 80 శాతం పూర్తి చేశార‌ని గుర్తు చేశారు. మిగిలిపోయిన పనులను పూర్తి చేసి నీరివ్వ‌కుండా అధికార టీడీపీ  నిర్ల‌క్ష్యం వ‌హిస్తోందని ధ్వ‌జ‌మెత్తారు.  చంద్ర‌బాబు స‌ర్కార్ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్మించే ప్రాజెక్టుల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం కూడా చేయ‌డం లేద‌ని ఫైర‌య్యారు. రాయ‌ల‌సీమ‌కు నీరు రానివ్వ‌కుండా తెలంగాణ ప్ర‌భుత్వం పాల‌మూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల‌ను నిర్మించి 150 టీఎంసీల నీరు తోడుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంద‌ని ఆవేదన వ్య‌క్తం చేశారు. ఆ ప్రాజెక్టులు నిర్మిస్తే రాయ‌ల‌సీమ ప్రాంతం ఎడారిగా మారుతుంద‌ని వివ‌రించారు. ఆ రెండు ప్రాజెక్టుల‌కు వ్య‌తిరేకంగా వైయ‌స్ జ‌గ‌న్ బాధ్య‌త‌తో జ‌ల‌దీక్ష‌ను చేప‌ట్ట‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు.

రైతుల పేరుచెప్పుకొని అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు ....అదే రైతుల‌కు అన్యాయం జ‌రుగుతున్నా క‌ళ్లు మూసుకొని కొంగ‌జ‌పం చేస్తున్నారని ఎమ్మెల్యే రాజ‌న్న‌దొర మండిప‌డ్డారు. వైయ‌స్ జ‌గ‌న్ జ‌ల‌దీక్ష ప్రాంగ‌ణం వ‌ద్ద ఆయ‌న మాట్లాడారు. తెలంగాణ సర్కార్ అక్రమ ప్రాజెక్టుల‌ను అడ్డుకోకుండా... చంద్ర‌బాబు ఇంకుడు గుంత‌ల పేరుతో ఆంధ్ర‌రాష్ట్రానికి అన్యాయం చేసేందుకు య‌త్నిస్తున్నారని విమ‌ర్శించారు. తెలంగాణ‌లోని పాల‌మూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల‌తో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌ని, చంద్ర‌బాబు తీరును, అన్యాయాన్ని అడ్డుకునేందుకు  అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ జ‌ల‌దీక్ష చేప‌ట్టార‌ని చెప్పారు. ఏపీకి జ‌రుగుతున్న అన్యాయాన్ని అడ్డుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ నేతృత్వంలో ఎన్ని పోరాటాలైనా చేసి హ‌క్కుల‌ను కాపాడుకుంటామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. రైతుల ప‌క్షాన నిల‌బ‌డి ఆ రెండు ప్రాజెక్టుల‌ను అడ్డుకునేందుకు గ్రామ‌స్థాయి నుంచి ఉద్య‌మిస్తామ‌ని ప్ర‌భుత్వాల‌ను హెచ్చ‌రించారు.
Back to Top