నవరత్నాలతో అన్నివర్గాలకు ప్రయోజనం

చెన్నూరు : వైయస్సార్‌సీపీ అద్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు కార్యక్రమంతో అర్హులైన అన్ని వర్గాల వారికి ప్రయోజనం చేకూరుతుందని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గుమ్మా రాజేంద్రప్రసాద్‌రెడ్డి, మండల కన్వినర్‌ జీఎన్‌ భాస్కర్‌రెడ్డిలు పేర్కొన్నారు. చెన్నూరు పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో శనివారం వారు సమావేశమై అనంతరం విలేకర్లతో మాట్లాడారు. నవరత్నాలులోని పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నియోజకవర్గాల్లో ప్రత్యేక సభలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. నవరత్నాల్లో పింఛను పెంపు, ఫీజురీయంబర్స్‌మెంటు, ఆరోగ్యశ్రీ, పక్కాగృహాలు అన్నవర్గాల వారికి ఫలితాలు అందించేలా జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టారన్నారు. వాటి గురించి భూత్, గ్రామ, మండల స్థాయి కమిటీలకు వివరంగా తెలిపి ప్రతి ఇంటికి చేరవేసేలా పార్టీ సంసిద్దులను చేసేందుకు ఈనెల 4న కమలాపురంలో నవరత్నాల సభ జరుగుతుందని దానిని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు చీర్ల సురేష్‌యాదవ్, ఎంపీటీసీలు భాస్కర్‌రెడ్డి, నరసయ్యయాదవ్, నాయకులు రామమనోహర్‌రెడ్డి, యర్రసానిమోహన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, పాలకొండారెడ్డి, 

జగన్‌ను కలసిన మండల నాయకులు
వీరపునాయునిపల్లెః ఏపీ శానపభా ప్రతిపక్షనేత,వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌మోహనరెడ్డిని పలువురు మండల నాయకులు శనివారం ఇడుపులపాయలో కలిశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నిమ్మకాయల సుధాకరరెడ్డి, మండల కన్వీనర్‌ రఘునాధరెడ్డి, అలిదెన మాజీ సర్పంచు వాసుదేవరెడ్డి, ఉరుటూరు సర్పంచు వెంకట్రామిరెడ్డి, నాయకులు ఉరుటూరు గంగిరెడ్డిలతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు కలిశారు.
Back to Top