చిట్టి త‌ల్లి ముఖం గుర్తుకు వ‌చ్చినా ప‌శ్చాతాపం క‌లిగేది..!


గుంటూరు) క‌ళ్ల ముందు ఒక వ్యక్తి చ‌నిపోతేనే
చాలా బాధ క‌లుగుతుంది. అటువంటిది అనేక రోజుల పాటు కాలేజీలో తిరుగాడిన విద్యార్థిని
ఆక‌స్మికంగా త‌నువుచాలిస్తే, అది కూడా ఆత్మ‌హ‌త్య చేసుకొంటే ఎంత వేద‌న
క‌ల‌గాలి. గుంటూరు శివారు నాగార్జున విశ్వ‌విద్యాల‌యం లోని ఆర్కిటెక్చ‌ర్ కాలేజీ
ప్రిన్సిపాల్ కు ఇవే ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి.

 

గుంటూరు లోని న్యాయ సేవాధికార సంస్థ
ముందు ఆయ‌న విచార‌ణ కు హాజ‌రు అయ్యారు. క‌ళాశాల‌లో ర్యాగింగ్‌, ప్రేమ పేరుతో వేధింపుల కార‌ణంగా ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకొన్న సంగ‌తి
తెలిసిందే. దీనిపై ప‌త్రిక‌ల్లో వచ్చిన వార్త ల ఆధారంగా కేసును సుమోటో గా తీసుకొని
విచార‌ణ చేశారు. ఇందుకు సంబంధించి నిందితుడుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆర్కిటెక్చ‌ర్
కాలేజీ ప్రిన్సిపాల్ బాబూరావు వచ్చారు. విచార‌ణ జ‌రుపుతున్న సంద‌ర్భంగా ఆయన హ‌వ
భావాలు అంద‌రినీ ఇబ్బంది పెట్టాయి.

 

క‌ళ్ల ముందు ఒక విద్యార్తిని చ‌నిపోయిన
కేసు విచార‌ణ జ‌రుగుతుంటే క‌నీసం మాన‌వ‌త్వం కూడా ముఖంలో క‌నిపించ కుండా పోయింది.
ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న తీరును కొంద‌రు మ‌హిళాన్యాయ‌వాదులు న్యాయ‌మూర్తి దృష్టికి
తీసుకొని వెళ్లారు.దానిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొన్న న్యాయ‌మూర్తి ..ప్రిన్సిపాల్ క‌ళ్ల
లో క‌నీసం ప‌శ్చాతాపంకూడా లేద‌ని వ్యాఖ్యానించారు. దీన్ని బ‌ట్టి ప్రిన్సిపాల్ వైఖ‌రి
ఎలా కొన‌సాగిందో అర్థం చేసుకోవ‌చ్చు.

Back to Top