బెదిరించి గెలిచారు: లింగయ్య

పినపాక:

ఖమ్మం జిల్లా పినపాక మండలంలో నిర్వహించిన సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ అక్రమ పద్ధతిలో గెలిచిందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు చందా లింగయ్య ఆరోపించారు. ఆదివాసీ గ్రామాల్లో ఓటర్లను బెదిరించి ఓట్లు వేయించుకున్నారని తెలిపారు. సహకార ఫలితాల అనంతరం కరకగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో కేవలం పినపాకకు మాత్రమే పరిమితమైందన్నారు. పినపాకలో మిత్రపక్షాలు ఐదు, వైయస్‌ఆర్‌సీపీ మూడు నియోజకవర్గాల్లో నైతికంగా గెలిచాయన్నారు. అన్ని స్థానాల్లో గట్టిపోటీనిచ్చామన్నారు. స్థానిక ఎమ్మెల్యే అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆదివాసీలను బెదిరించారని ఆరోపించారు. పోలీసుల ప్రభావం గ్రామాల్లో ఎక్కువగా పనిచేసిందన్నారు. ప్రజల తీర్పును స్వీకరించి రైతుల పక్షాన పోరాటాలు కొనసాగిస్తామన్నారు.

Back to Top