అందుకే కుప్పం నుంచి జగన్‌ 'శంఖారావం'

తిరుపతి, 27 నవంబర్ 2013:

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు సమైక్యాంధ్ర ద్రోహి అయినందు వల్లే శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి కుప్పం నుంచి సమైక్య శంఖారావాన్ని పూరిస్తున్నారని ఆయన అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో బుధవారం మాట్లాడారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో శ్రీ జగన్కు బ్రహ్మరథం పట్టడానికి ‌ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

శ్రీ జగన్‌ పర్యటనను అడ్డుకోండి అని చంద్రబాబు పిలుపునివ్వడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని భూమన వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రం కోసం శ్రీ జగన్ ఒకవైపు దేశంలోని వివిధ పార్టీల మద్ద‌తు కూడగడుతూనే మరోవైపు ప్రజలను చైతన్య  పరుస్తున్నారన్నారు. సమైక్య శంఖారావం దిగ్విజయం అవుతుందని భూమన తెలిపారు.

Back to Top