మ‌హానేత చొర‌వ‌తోనే బీడు భూములు స‌స్య‌శ్యామ‌లం

న‌ర‌స‌న్న‌పేట‌:  మ‌హానేత‌, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చొర‌వ‌తోనే బీడు భూములు స‌స్య‌శ్యామ‌లం అవుతాయ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ధ‌ర్మాన కృష్ణ‌దాస్ అన్నారు.  జిల్లాలో ప్రధాన నదుల్లో ఒకటైన వంశధార లో ఏటా సముద్రానికి నీరు వృథాగా పోతుంది. ఈ నీటిని ఎలాగైనా సద్వినియోగం చేసుకొని జిల్లా ప్రజలకు సాగు నీటి సరఫరా మెరుగు పరచాలని వైయ‌స్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేరడి వద్ద బ్యారేజి నిర్మాణానికి ఏర్పాట్లు చేశార‌న్నారు. అప్పట్లో దీనిని ఒడిస్సా రాష్ట్రం బూతద్దంలో చూసి అన‌వ‌స‌రంగా రాద్దాంతం చేస అభ్యంతరాలు తెలిపింద‌న్నారు.  ప్రస్తుతం ట్రిబ్యునల్‌ తీర్పు వెల్లడించడం..అదీ జిల్లా ప్రజలకు అనుకూలంగా రావడం ఎంతో ఆనందించాల్సిన విషయమ‌న్నారు. రాజన్న దూర దృష్టి నేడు ఫలించింద‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు.. ప్రస్తుత ప్రభుత్వం రాజకీయాలు చేయకుండా అప్పట్లో చేసిన ప్రతిపాదనల మేరకు నేరడి వద్ద బ్యారేజి నిర్మించి జిల్లా సస్యశ్యామలం చేసేందుకు చర్యలు తీసుకొవాల‌న్నారు. ప్రభుత్వం దీని పై ఎన్ని వక్ర బాష్యాలు చేప్పినా అసలు వాస్తవం జిల్లా ప్రజలకు తెలుసు అన్నారు. 
-----------------------------
నవరత్నాల సభను విజయవంతం చేయండి
పూసపాటిరేగ: ఈనెల 18న డెంకాడ మండలం పెదతాడివాడలోగల పీబీఆర్‌ కల్యాణ మండపంలో జరగబోయే నవరత్నాలు సభను విజయవంతం చేయాలని మండల వైయ‌స్‌ఆర్‌సీపీ పార్టీ అధ్యక్షుడు పతివాడ అప్పలనాయుడు కోరారు. శుక్రవారం మండలంలోని కొప్పెర్ల బొల్లు అప్పారావు కల్లాలు వద్ద జరిగిన సమావేశంలో మాట్లాడారు. నవరత్నాలు కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకువెళ్లడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషిచేయాలన్నారు. నవరత్నాలు సభలో కోలగట్ల వీరభద్రస్వామి, వైయ‌స్‌ఆర్‌సీపీ జిల్లా రాజకీయవ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, సీఈసీ సభ్యడు పెనుమత్స సాంబశివరాజు, జిల్లాపార్టీ అధ్యక్షుడు బి చంద్రశేఖర్‌, నెల్లిమర్ల నియోజకవర్గ ఇంచార్జి సురేస్‌బాబు, మాజీ శాసనసభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు, కందుల రఘుబాబు తదితరులు హాజరవుతారన్నారు.  

తాజా వీడియోలు

Back to Top