మరో రెండేళ్లు ఓపిక పట్టండి

  • తూ.గో. జిల్లాలో జననేత పర్యటన
  • పోలవరం నిర్వాసితులకు బాసటగా రెండ్రోజుల పర్యటన
  • రాజమండ్రి ఎయిర్ పోర్టులో వైయస్ జగన్ కు ఘనస్వాగతం
  • వైయస్ జగన్ ను కలిసిన కాంట్రాక్ట్ లెక్చరర్లు
  • ఏళ్ల తరబడి పనిచేసిన రెగ్యులర్ చేయడం లేదని ఆవేదన
  • మన ప్రభుత్వం వచ్చాక మూడు నెలల్లోనే రెగ్యులర్ చేస్తానని భరోసా
తూర్పుగోదావరిః ప్రతిపక్ష నేత వైయస్ జగన్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బూరుగుపూడి వద్ద కాంట్రాక్ట్ లెక్చరర్లు వైయస్ జగన్ ను కలిశారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా తమను రెగ్యులర్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వైయస్ జగన్ కు వినతిపత్రం అందించారు. మీ మాదిరే బాబు అందరినీ మోసం చేశాడని వైయస్ జగన్ అన్నారు. అధైర్యపడొద్దని మరో రెండేళ్లు ఓపిక పట్టాలని కాంట్రాక్ట్ లెక్చరర్లకు సూచించారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లోనే కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని భరోసా ఇచ్చారు. 

అంతకుముందు  రాజమండ్రి చేరుకున్న వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో రంపచోడవరంలో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో వైయస్‌ జగన్‌ పాల్గొంటారు. గురువారం కూనవరం మండలంలోని రేఖపల్లి గ్రామాన్ని వైయస్‌ జగన్‌ సందర్శిస్తారు. అక్కడ కూడా ఆయన పోలవరం బాధిత ప్రజలతో మాట్లాడతారు. అక్కడి గిరిజనుల ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసు కుంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ వెల్లడించారు. అలాగే.. ఈ నెల 9న ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద నిర్వహించే ధర్నాలో వైయస్‌ జగన్‌ పాల్గొననున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Back to Top