బాబుపై బీసీల తిరుగుబాటు ఖాయం

  • రాజధాని ప్రాంతంలో అధికార టీడీపీ దుర్మార్గమైన పని
  • సర్పంచ్ ఇంటిపై దాడి, కారును తగలబెట్టడం దేనికి సంకేతం
  • కారును దగ్ధం చేసి రెండ్రోజులైనా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు
  • ఇకపై ఇదే పద్ధతి కొనసాగితే చూస్తూ ఊరుకోం
  • బీసీలకు మేలు చేసిన నిజమైన నాయకుడు వైయస్ఆర్ 
  • చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం
  • వచ్చేది మన ప్రభుత్వం, పేదవాడి ప్రభుత్వం
  • నిడమనూరులో వైయస్ జగన్
కృష్ణాః రాజధాని ప్రాంతంలో అధికార టీడీపీ దుర్మార్గాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుందని వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మండిపడ్డారు. నిడమనూరు సర్పంచ్ కోటేశ్వరరావు కారును తగలబెట్టి రెండ్రోజులైన ఇంతవరకు దుండగులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమనని అన్నారు. పోలీసులను వాడుకుంటూ టీడీపీ నేతలు రాజధాని ప్రాంతంలో యథేశ్చగా దౌర్జన్యాలు చేస్తుంటే ముఖ్యమంత్రి  ఏం చేస్తున్నారని నిలదీశారు. కోటేశ్వరరావు వైయస్సార్సీపీలో చేరడాన్న అక్కసుతో టీడీపీ నేతలు ఆయన ఇంటిపై దాడి చేసి కారు దగ్థం చేసిన ఘటనపై వైయస్ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

కోటేశ్వరరావును పరామర్శించిన అనంతరం వైయస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ...సర్పంచ్ ఇంటిపై దాడి చేయడం. కార్లు తగలబెట్టడం. పోలీసులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోకపోవడం. కేసులు పెట్టకపోవడం దేనికి సంకేతమని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. సర్పంచ్ తన కార్యాలయానికి వెళ్ళడానికి కూడా వీల్లేకుండా తాళం వేసి రెచ్చగొట్టే కార్యక్రమం చేయడం క్షమించరానిదని అన్నారు. ఇక ముందు ఇదే పద్ధతి కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీసీల వల్లే తాను అధికారంలోకి వచ్చానని చెప్పుకుంటున్న చంద్రబాబుపై అదే బీసీలు తిరగబడితే పరిస్థితి ఎలా ఉంటుందో తొందర్లోనే తెలుస్తుందని అన్నారు. చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. బాబు పాలన ఎల్లకాలం సాగదని, వచ్చేది మన పేదవాడి ప్రభుత్వం. ప్రజల ప్రభుత్వమని వైయస్ జగన్ చెప్పారు. 

నిజంగా బీసీలకు మేలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మహానేత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అని చెప్పడానికి తాను గర్విస్తానని వైయస్ జగన్ అన్నారు. కత్తెర్లు, ఇస్త్రీపెట్టెలు ఇచ్చి బీసీలకు మేలు చేశామని బాబు చెప్పుకోవడం హాస్యాస్పమదన్నారు. నిజంగా పేదరికం పోవాలంటే ఆ పిల్లలు చదువుకోవాలని చెప్పి ఎవరూ అప్పుల పాలు కాకుండా పేదవాడి పిల్లలను ఇంజినీర్లు, డాక్టర్లను చదివించి గొప్ప కార్యక్రంమ చేసిన వ్యక్తి వైయస్ఆర్ అని చెప్పారు. బాబు వచ్చాక ఎడాపెడా ఫీజులు పెంచేస్తున్నాడని ఆగ్రహించారు. ఫీజులు చూస్తే లక్షలు వసూలు చేస్తున్నారని, కానీ ఫీజు రీయింబర్స్ మెంట్ చూస్తే మాత్రం ఇప్పటికే అదే 30 వేలు ఉందని అన్నారు. మిగతా ఫీజులు కట్టుకునేందుకు మళ్లీ ఆ పేద బీసీలు అప్పులు పాలవుతున్న పరిస్థితి ఉందని అన్నారు. 

వైయస్సార్సీపీకి నిడమనూరు గ్రామంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 900 ఓట్ల మెజారిటీ వచ్చిందని వైయస్ జగన్ గుర్తు చేశారు. ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే హక్కు లేకుండా వారిని దూరం చేసే కార్యక్రమం మానుకోవాలని చంద్రబాబును హెచ్చరించారు. బాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కారును తగలెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని రోడ్డుమీద కొట్టుకుంటూ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో  పెట్టినప్పుడే బలహీన వర్గాలకు న్యాయం చేసినట్లు అవుతుందన్నారు.అంతే గానీ తూతూమంత్రంగా ఏదో చేశామంటే చేశామన్నట్టుగా ఎవరిపై గట్టి చర్యలు తీసుకోకుండా చేస్తే మాత్రం బాబు ప్రభుత్వం బంగాళాఖాతంలో కలవడం ఖాయమన్నారు. ఇప్పటికే ఘటన జరిగి రెండ్రోజులైంది. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ లు జరగకపోగా కార్యాలయానికి లాక్ వేయడంలో అర్థమేమిటి.  బాబు సిగ్గుతో తలదించుకోవాలని వైయస్ జగన్ నిప్పులు చెరిగారు. కోటేశ్వరరావు టీడీపీ బీఫాంపై గెలవకపోయినా మావాడే అని ఎలా చెప్పుకుంటారని అధికార టీడీపీని వైయస్ జగన్ ప్రశ్నించారు.  
Back to Top