బీసీ నేత వెంకటేశ్ వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌
కదిరి: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, బీసీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటేశ్ వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో  చేరారు. ఆయనకు పార్టీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కండువా వేసి, సాదరంగా ఆహ్వానించారు. బీసీల పార్టీ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలను మోసం చేస్తున్నారని, చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాలని తాను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రచారం చేస్తానని ఆయన జగన్‌తో అన్నారు. అందుకు జగన్‌ ఆయన్ను అభినందించారు. తాను వడ్డెర్ల సంఘం రాష్ట్ర నాయకుడిగా కూడా పని చేస్తున్నానని, రాష్ట్రంలో ఉన్న వడ్డెర్లంతా వచ్చే ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసేలా తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు.   


Back to Top