ఇది బీసీల భరోసా యాత్ర

చిత్తూరు

: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర బీసీల భరోసా యాత్రగా సాగుతుందని వైయస్‌ఆర్‌సీపీ బీసీ సెల్‌ అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి అన్నారు. పాపానాయుడిపేటలో ఏర్పాటు చేసిన బీసీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎలాంటి చట్టాలు లేవని, విఫరీతమైన దౌర్జన్యమైన పాలన సాగుతుందని జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. బడుగులకు భరోసా కల్పించేందుకు వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారన్నారు. రాజు మంచివాడు అయితే రాష్ట్రంలో సుభిక్షంగా ఉంటారన్నారు. ప్రజలకు దక్కాల్సిన వనరులను వారికి దక్కకుండా సంపద మొత్తం కూడా దోపిడీ చేస్తుందన్నారు. ఇలాంటి ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు వైయస్‌ జగన్‌ పాదయాత్రగా బయలుదేరి అందరికి భరోసా కల్పిస్తున్నారన్నారు. ఇది బీసీల భరోసా యాత్ర అన్నారు. టీడీపీ బీసీలకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. బీసీ వర్గాలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలను టీడీపీ 30 ఏళ్లుగా వాడుకుంటుందని ధ్వజమెత్తారు. రజకులు, శాలివాహన, నాయీబ్రహ్మణ కులాలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పిస్తామని వైయస్‌ జగన్‌ ఇదివరకే హామీ ఇచ్చారని చెప్పారు. ప్రతి ఒక్క బడుగు, బలహీన వర్గాల ప్రజలు వైయస్‌ జగన్‌కు అండగా నిలవాలని ఆయన కోరారు. బీసీల జీవనప్రమాణాలను పెంచేందుకు వైయస్‌ జగన్‌ ఇటీవల బీసీ అధ్యాయన కమిటీ ఏర్పాటు చేశారన్నారు. పాదయాత్ర ముగిసేలోగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బీసీల స్థితిగతులను తెలుసుకొని, బీసీ డిక్లరేషన్‌ చేస్తామన్నారు. డిక్లరేషన్‌లో ఏదైతే పొందుపరిచారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తారని చెప్పారు. వైయస్‌ జగన్‌ నాయకత్వం చారిత్రాత్మక ఆవస్యకత ఉందన్నారు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలంతా కూడా వైయస్‌ జగన్‌ను ఆశీర్వదించాలని ఆయన కోరారు.

Back to Top