ప్రకాశం జిల్లాలో బీసీ అధ్యయన కమిటీ సమావేశం


ప్రకాశం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్‌ఆర్‌సీపీ బీసీ అధ్యయన కమిటీ ప్రకాశం జిల్లాలో సమావేశమైంది. ఈ నెల 19వ తేదీ నుంచి 30వ  తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీసీ అధ్యయన కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వైయస్‌ఆర్‌సీపీ బీసీ విభాగం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి తెలిపారు. ఇవాళ ఒంగోలులోని మంగమ్మ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన బీసీ అధ్యయన కమిటీలో కృష్ణమూర్తి, తాజా, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 24న పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో, 26నఅనంతపురంలోని హెచ్‌ఎస్‌సీ కాలనీలో, 28న చిత్తూరు జిల్లాలో, 30న ఒంగోలులో వడ్డెర సంఘం సమావేశం జరుగుతుందని చెప్పారు.
 
Back to Top