బాబు పాలన రియలెస్టేట్‌ వ్యాపారం

హోదా కంటే ప్యాకేజీ మేలని మభ్యపెట్టాడు
ఇప్పుడు ఉద్యమం ఉధృతం కావడంతో దొంగ నాటకాలు
ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణగదొక్కిన దుర్మార్గుడు చంద్రబాబు
టీడీపీ ప్రజలే తగిన బుద్ధి చెబుతారు
ప్రకాశం: ఆంధ్రరాష్ట్రంలో చంద్రబాబు పాలన రియలెస్టేట్‌ వ్యాపార సంస్థగా మారిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. దోచుకున్న సొమ్మును దాచుకునే ప్రయత్నం తప్ప రాష్ట్ర ప్రజల క్షేమం గురించి ఆలోచించే ప్రయత్నం చంద్రబాబు చేయడం లేదన్నారు. తాళ్లూరులో బత్తుల మీడియాతో మాట్లాడుతూ.. 2014 ఎన్నికల ముందు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని మాట్లాడిన చంద్రబాబు తరువాత తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్యాకేజీని తీసుకొచ్చి, హోదా అంటే జైల్లో పెడతానని ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాడని మండిపడ్డారు. హోదాకంటే ప్యాకేజీ బ్రహ్మండంగా ఉందని మభ్యపెట్టే ప్రయత్నం చేశాడన్నారు. ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ అనేక ఉద్యమాలు చేపట్టారన్నారు. శ్రీకాకుళం మొదలు అన్ని జిల్లాల్లో యువభేరీలు నిర్వహించి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై యువతను చైతన్యవంతులను చేశారన్నారు. 
ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే నాయకుడు వైయస్‌ జగన్‌
రాజధాని శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వస్తున్నారని, ప్రత్యేక హోదా కోసం గుంటూరులో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షను పోలీసుల చేత భగ్నం చేయించారని బత్తుల మండిపడ్డారు. హోదా ఉద్యమాన్ని దుర్మార్గంగా అణగదొక్కిన దుర్మార్గుడు దౌర్భాగ్యుడు చంద్రబాబు అని విమర్శించారు. ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే నాయకుడు వైయస్‌ జగన్‌ ఒక్కడేనన్నారు. వైయస్‌ జగన్‌ చేస్తున్న ఉద్యమాలకు, పాదయాత్రకు జనం నుంచి వస్తున్న స్పందనను చూసి చంద్రబాబుకు వణుకుపడుతుందన్నారు. రాజకీయ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తూ నీచాతి నీచంగా పాలన సాగిస్తున్న చంద్రబాబుకు ప్రజల తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 
 
Back to Top