పిచ్చి పీక్ స్టేజ్ కి చేరింది...!

హైదరాబాద్ః  వైఎస్ ఆర్సీపీ నేత బత్తుల బ్రహ్మానందరెడ్డి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టిందని, ఆ పిచ్చి కాస్తా పీక్ స్టేజ్ కి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల జీతాలకే డబ్బులు లేవన్న చంద్రబాబు, తన ప్రచారానికి మాత్రం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో  మండిపడ్డారు. రాజధాని శంకుస్థాపన పేరుతో రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.

గోదావరి పుష్కరాలలో రూ.1650 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే అందులో రూ.1400 కోట్లు దుర్వినియోగం అయ్యాయని బత్తుల బ్రహ్మానందరెడ్డి తెలిపారు. శంకుస్థాపనకు వస్తున్న అతిథుల కోసం సొంత హోటల్స్ లో విడిది ఏర్పాటు చేసి ..ప్రజాధనం, ప్రభుత్వ ఖజనాకు తూట్లు పొడుస్తున్నారన్నారు. ఇక ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకే రాజధాని శంకుస్థాపనకు కేసీఆర్ ను ఆహ్వానిస్తున్నారని బత్తుల ఆరోపించారు. 
Back to Top