బత్తాయి రైతులకు షర్మిల భరోసా

నల్గొండ:

కొద్దికాలం  ఓపికపడితే మీ కష్టాలు తొలగిపోతాయని శ్రీమతి వైయస్ షర్మిల ఇచ్చిన హామీ తమకు సంతోషాన్ని కలిగించిందని బత్తాయి రైతులు చెప్పారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా ఆమె బత్తాయి రైతులను కలిశారు. తోటలను పరిశీలించి వారిని ఓదార్చారు. ఇందుకోసం ఆమె చేల గట్ల మీద నడిచివెళ్ళారు. ఎండిన బత్తాయి చెట్లతో రైతులు ఆమెకు ఎదురొచ్చారు. పక్కనే ఉన్న బత్తాయి తోటలకు ఆమెను తీసుకెళ్ళారు. మహానేత డాక్టర్ వైయస్ఆర్ జీవించి ఉంటే ఈ ప్రాంతానికి నీరు వచ్చేదనీ, తమకీ ఇబ్బంది ఉండేది కాదనీ రైతులు తెలిపారు. నీరు లేక తమ తోటలను కొట్టేసినట్లు చెప్పారు. కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయనీ, కట్టలేకపోతే చర్యలు తీవ్రంగా ఉంటున్నాయనీ వివరించారు. తొలగించిన కరెంటును పునరుద్ధరించుకోవడానికి నాలుగు రోజులు పట్టిందనీ, ఈలోగా తోట ఎండిపోయిందనీ వారు ఆవేదన వ్యక్తంచేశారు.

Back to Top