వైయస్‌ జగన్‌ను కలిసి ఎన్టీఆర్‌ సతీమణి బంధువులు

పోలీసులు సైతం చంపేస్తామంటున్నారు
పెద్ద కుమారుడు రాజ్‌కుమార్‌ కుటుంబాన్ని కిడ్నాప్‌ చేశారు
న్యాయం చేయాలని వైయస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేత

కృష్ణా: టీడీపీ నేతలు తమను చంపేస్తామంటున్నారని ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం బంధువులు  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్ను తాడంకి వద్ద కాట్రగడ్డ సుబ్బారావు దంపతులు కలిశారు. మచిలీపట్నం ఎంపీ కొనకల్ల నారాయణరావు అండతో ఆయన మేనల్లుడు పామర్తి అనీల్‌కుమార్‌ వేధిస్తున్నాడని, రియలెస్టేట్‌ వ్యవహారంలో తమ కుమారుడు కాట్రగడ్డ రామ్‌కుమార్, కొడలు, వారి పిల్లలను పోలీసులు కిడ్నాప్‌ చేశారన్నారు. తమ కుటుంబాన్ని రక్షించాలని కాట్రగడ్డ సుబ్బారావు, శివలీల దంపతులు వైయస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. 

కిడ్నాప్‌కు గురైన కాట్రగడ్డ రామ్‌కుమార్‌ సోదరుడు వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఎంపీ మేనల్లుడు పామర్తి అనీల్‌కుమార్‌ ల్యాండ్‌ విషయంలో మా అన్న రాజ్‌కుమార్‌ కుటుంబాన్ని పోలీసుల చేత కిడ్నాప్‌ చేయించారని, స్టేషన్‌కు వెళ్లినా వారు ఎక్కడున్నారో చూపించడం లేదన్నారు. న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ దగ్గరకు వెళ్తే ఎంపీతో సెటిల్‌మెంట్‌ చేసుకోండి లేకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని, తన ఫోన్‌ కూడా తీసుకుని, తనపై కూడా నిఘా పెట్టమన్నారు. చిన్న పిల్లలను కూడా కిడ్నాప్‌ చేశారు. నా కొడుకు ఎక్కడున్నాడో చూపించాలని రాజ్‌కుమార్‌ తల్లి కన్నీరు పెట్టుకుంది. మా పిల్లలను మాకు అప్పగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వైయస్‌ జగన్‌ను కోరారు.

తాజా ఫోటోలు

Back to Top