బ్యాంకు డైరెక్ట‌ర్లు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌ప్ర‌కాశం: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష‌లు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు అన్ని వ‌ర్గాల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ప్ర‌జ‌లు తండోప‌తండాలుగా త‌ర‌లివ‌చ్చి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ సీఎం అయితే క‌ష్టాలు తొల‌గిపోతాయ‌ని భావిస్తున్నారు. ఈక్ర‌మంలో చాలామంది నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల కోసం ప‌డుతున్న త‌ప‌న చూసి వైయ‌స్ఆర్‌సీపీలో చేరేందుకు ముందుకు వ‌స్తున్నారు. పాదయాత్రలో భాగంగా ప్ర‌కాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ డైకెక్టర్‌ కర్ణ లక్ష్మారావు, మద్దు ప్రకాష్‌రావు వైయ‌స్‌ జగన్‌ను కలిశారు. వీరు వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి వైయ‌స్‌ జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు.
Back to Top