ధరలు పెంచడమేనా బంగారు తెలంగాణ??

రంగారెడ్డి జిల్లా: టీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యుత్, బస్ చార్జీలను పెంచి పేద, మధ్య తరగతి ప్రజల నడ్డివిరిచిందని వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ర్ట అధ్యక్షురాలు అమృతసాగర్ విమర్శించారు.  ఇబ్రహీంపట్నంలో ఎండీ ఖాలేద్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ధరలు పెంచుకుంటూ పోతే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విద్యుత్, బస్ చార్జీలను ఒక్క పైసా కూడా పెంచకుండా బంగారు పాలన అందించారని గుర్తు చేశారు. పెంచిన చార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
 
పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం..ప్రజలతో మమేకమై ఉద్యమిద్దాం
రాష్ర్టంలో వైయస్సార్ సీపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని అమృతసాగర్ కోరారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలతో మమేకమై ఉద్యమించాలని సూచించారు. పార్టీ నూతన కమిటీలను త్వరలో నియమించనున్నట్లు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాదగోని జంగయ్యగౌడ్, జిల్లా కార్యదర్శులుగా నల్ల ప్రభాకర్, ఎండీ.ఖాలేద్, యాచారం, మంచాల మండలాల అధ్యక్షులుగా పి.జయరాజ్, బుగ్గరాములు, ఇబ్రహీంపట్నం మండల విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా దూసారి వేణుప్రసాద్‌గౌడ్, మంచాల బీసీ సెల్ అధ్యక్షుడిగా భూర జంగయ్యగౌడ్‌ను నియమించాలని రాష్ట్ర అధిష్టానానికి ప్రతిపాదనలు పంపించినట్లు వివరించారు. నాయకులు డి.కుమార్‌గౌడ్, ఎల్. యాదగిరి, కె.సురేందర్‌రెడ్డి, ఎన్.మహేష్, టి.అబ్బాస్‌గౌడ్, కె.సతీష్, ఎస్‌కే జావిద్, ఆర్.రఘవీర్ పాల్గొన్నారు.
Back to Top