హోదా కోసం గర్జన..బంద్ సక్సెస్

()ప్రత్యేకహోదా కోసం ఏపీ బంద్
()హోదా కోసం గర్జించిన వైయస్సార్సీపీ
()కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వంచనపై ధ్వజం
()రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన..నేతల అరెస్ట్ లు

ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అంటూ రాజ‌మండ్రి ఆర్టీసీ డిపో ఎదుట వైయ‌స్సార్‌సీపీ నేత సూర్య‌ప్ర‌కాశ్ రావు ఆధ్వ‌ర్యంలో ధర్నా నిర్వ‌హించారు. ఈ ధ‌ర్నాలో వైయ‌స్సార్‌సీపీ మ‌హిళ నాయ‌కురాలు ష‌ర్మిలారెడ్డితో ప‌లువురు కార్య‌క‌ర్త‌లు స్వ‌చ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. గోక‌వ‌రం, జ‌గ్గంపేట‌, అన‌ప‌ర్తిల్లో వైయ‌స్సార్‌సీపీ నాయ‌కులు ప్ర‌సాద్, జ‌గ్గంపేట, అన‌ప‌ర్తి కోఆర్డినేట‌ర్లు ముత్యాల శ్రీ‌నివాస్, సూర్య‌నారాయ‌ణ‌ల ఆధ్వ‌ర్యంలో బంద్ విజ‌య‌వంతంగా కొన‌సాగింది. రాజోలు ఆర్టీసీ డిపో ఎదుట వైయ‌స్సార్‌సీపీ నాయ‌కులు బొంతు రాజేశ్వ‌ర‌రావు, విశ్వ‌రూప్‌ల ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు కొనసాగాయి. కోరంపూడిలో బంద్ నిర్వ‌హిస్తున్న వైయ‌స్సార్‌సీపీ మ‌హిళా నాయ‌కురాలు విజ‌య‌ల‌క్ష్మి స‌హా 20మంది కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్ట్ చేసి పీఎస్ కు త‌ర‌లించారు. మండ‌పేట వైయ‌స్సార్‌సీపీ కో-ఆర్డినేట‌ర్ లీలాకృష్ణ ఆధ్వ‌ర్యంలో బంద్ కొన‌సాగ‌గా, క‌డియ‌పులంక కోఆర్డినేట‌ర్ వీర్రాజు ఆధ్వ‌ర్యంలో హైవే దిగ్భాందం చేశారు. ముమ్మిడివ‌రంలో వైయ‌స్సార్‌సీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి గుత్తుల సాయి ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి. 

ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగాకు నిరసనగా పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కొన‌సాగాయి. పులివెందుల బస్టాండ్ వద్ద వైయ‌స్సార్‌సీపీ కార్యకర్తలు బస్సులను అడ్డుకున్నారు. వ్యాపార, వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నాయి. జమ్మలమడుగులో సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వ‌హించారు. జమ్మలమడుగు ఆర్టీసీ డిపో వద్ద బస్సులను కార్యకర్తలు అడ్డుకున్నారు.రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇచ్చిన కడప ఆర్టీసీ బస్ డిపో వద్ద ఆందోళన చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప నగర మేయర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు నిత్యానందరెడ్డితో పాటు వామపక్షాల నేతలను పోలీసులు అరెస్టుచేసి రిమ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఏలూరు డిపో ఎదుట శాంతియుతంగా ఆందోళ‌న నిర్వ‌హిస్తున్న వైయ‌స్సార్సీపీ నాయ‌కులు శ్రీ‌నివాస్‌, ల‌క్ష్మి, బ్ర‌హ్మ‌వ‌తిల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అంటూ త‌ణుకులో వైయ‌స్సార్‌సీపీ నాగేశ్వ‌ర‌రావు ఆధ్వ‌ర్యంలో బ‌స్టాండ్ ఎదుట ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ద్వారకా తిరుమ‌ల‌లో డిపో ఎదుట బ‌స్సులు అడ్డుకున్న వైయ‌స్సార్సీపీ నేత వెంక‌ట్రావ్ స‌హా ప‌లువురు కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పాల‌కొల్లు, భీమ‌వ‌రంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ‌నివాస్ ఆధ్వ‌ర్యంలో బంద్ ప్ర‌శంతంగా కొన‌సాగుతుంది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా అధ్య‌క్షుడు ఆళ్ల‌నానిని ఏలూరులో ఉద‌యం పోలీసులు హౌజ్ అరెస్ట్ చేయ‌గా. నాని నాయ‌క‌త్వంలో ప‌లువురు కార్య‌క‌ర్త‌లు బంద్ నిర్వ‌హిస్తున్నారు. విద్య‌, వ్యాపార, వాణిజ్య సంస్థ‌లు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి స్వ‌చ్ఛంధంగా బంద్ లో పాల్గొన్నాయి. చెందులూరు స‌మ‌న్వ‌య‌క‌ర్త రామ‌చంద్రరావును పోలీసులు ఉద‌య‌మే హౌజ్ అరెస్ట్ చేశారు. 

కృష్ణాజిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగింది. వర్తక, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. పలువురు వైయ‌స్సార్‌సీపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేశారు. తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ డిపోల ఎదుట వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు భారీ ఎత్తున ధర్నాలు చేపట్టడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జ‌గ్గ‌య్య‌పేట‌లో బంద్ నిర్వ‌హిస్తున్న వైయ‌స్సార్‌సీపీ నేత ఉద‌య‌బానును పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్‌కు త‌ర‌లించారు. హనుమాన్‌జంక్ష‌న్‌లో స‌మ‌న్వ‌య‌క‌ర్త రామచంద్రరావు ఆధ్వ‌ర్యంలో బంద్ కొన‌సాగగా... నూజివీడు ఎమ్మెల్యే మేకా అప్పారావు ఆధ్వ‌ర్యంలో ఆర్టీసీ డిపో ఎదుట ద‌ర్నాకార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో అప్ప‌రావు స‌హా 25మంది కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర బంద్ నేప‌థ్యంలో నందిగామ‌లో ముందుగానే పోలీసులు భారీగా మొహ‌రించి ప‌లువురు వైయ‌స్సార్‌సీపీ నాయ‌కుల‌ను హౌజ్ అరెస్ట్ చేశారు. విజ‌య‌వాడ న‌గ‌ర అధ్య‌క్షుడు వంగ‌వీటి రాధా, పార్థ‌సార‌ధి ఆధ్వ‌ర్యంలో బైక్ ర్యాలీ కొన‌సాగింది. బైక్ ర్యాలీ నిర్వ‌హిస్తున్న రాధా, పార్థ‌సార‌ధి స‌హా ప‌లువురు వైయ‌స్సార్‌సీపీ కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బంద్‌ను నిర్వీర్యం చేసేందుకు చంద్ర‌బాబు కుట్ర‌లు ప‌న్నిఅరెస్ట్‌లు చేయిస్తున్నార‌ని మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీ జోగి ర‌మేష్ అన్నారు. మ‌చిలీప‌ట్నం వైయ‌స్సార్‌సీపీ నేత పేర్నీనానిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. 

ఒంగోలులో పోలీసుల అత్యుత్స‌హం.  బంద్ కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌క‌ముందే ప‌లువురి వైయ‌స్సార్‌సీపీ కార్య‌క‌ర్త‌ల అరెస్ట్‌. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని హౌజ్ అరెస్ట్ చేసిన పోలీసులు. సుబ్బారెడ్డి ఇంటిచుట్టూ భారీగా మొహ‌రించిన పోలీసులు. ఏపీలో రాక్షస పాలన నడుస్తోందని వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ప్రశాంతంగా సాగుతున్న బంద్‌పై ఉక్కుపాదం మోపాలని చూస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల చర్యల ద్వారా ప్రజాగ్రహాన్ని అణచివేయలేరని స్పష్టం చేశారు. ఎంపీలు ఒంటికి కారం పూసుకోవాలన్న పవన్‌ వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి అభ్యంతరం తెలిపారు. కారం తిన్నాం కాబ్టే పోరాటం చేస్తున్నామన్నారు. మీ దయా దాక్షిణ్యాల మీద వైయ‌స్సార్‌సీపీ ఎంపీలు గెలవలేదని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. బంద్‌లో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి ఒంగోలు వస్తుండగా ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డిని  సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి కురిచేడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కందుకూరులో బంద్ చేప‌ట్టిన వైయ‌స్సార్‌సీపీ నాయ‌కులు కొల్లూరి కొండ‌య్య అరెస్ట్. 

నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరిలో మాజీ ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ ఆధ్వ‌ర్యంలో బంద్ కొనసాగింది. అనంత‌పురం క‌దిరిలో బంద్ నిర్వ‌హిస్తున్న 200 మంది వైయ‌స్సార్‌సీపీ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్ట్ చేసిన పోలీసులు. అరెస్ట్ చేసిన కార్య‌క‌ర్త‌ల‌ను ప‌లు పోలీస్‌స్టేష‌న్ల‌కు త‌ర‌లింపు. విజ‌య‌న‌గరంలో వైయ‌స్సార్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు కొలగ‌ట్ల ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న బంద్‌. విజ‌య‌న‌గ‌రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వ‌ద్ద ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన వైయ‌స్సార్‌సీపీ నాయ‌కులు, గ‌జ‌ప‌తిన‌గ‌రంలో బంద్‌లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పాల‌న‌ర్స‌య్య‌, చీపురుప‌ల్లిలో వైయ‌స్సార్‌సీపీ నేత శ్రీ‌నివాస్ హౌజ్ అరెస్ట్‌. 

గుంటూరు ఆర్టీసీ బ‌స్టాండ్ ఎదుట వైయస్సార్సీపీ నేత‌ల ధ‌ర్నా, చిల‌క‌టూరిపేటలో ఉద్రిక్త వాతావ‌ర‌ణంలో వైయ‌స్సార్‌సీపీ నాయ‌కుడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ స‌హా కార్య‌క‌ర్త‌లు, అరెస్ట్. న‌ర్స‌రావుపేటలో వైయ‌స్సార్‌సీపీ నాయ‌కులు గోపిరెడ్డి శ్రీ‌నివాస్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో ధర్నా. వినుకొండ‌లో వైయ‌స్సార్‌సీపీ నేత బ్ర‌హ్మ‌నాయుడు స‌హా కార్య‌క‌ర్త‌ల అరెస్ట్‌, కొండ‌మోడులో అంబ‌టి రాంబాబు ఆధ్వ‌ర్యంలో కొన‌సాగిన ధ‌ర్నా కార్య‌క్ర‌మాలు అంబ‌టి రాంబాబు అరెస్ట్‌.  పీఎస్‌కు త‌ర‌లింపు, పొన్నూరు వైయ‌స్సార్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌క‌ర్త వెంక‌టర‌మ‌ణ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా.

తాజా ఫోటోలు

Back to Top