ప్ర‌శాంతంగా సాగుతున్న ఏపీ బంద్‌

 ప్రత్యేక హోదా విష‌యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనుసరిస్తున్న తీరుకు నిరసనగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ బంద్ కు పిలుపునిచ్చిన నేప‌థ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బంద్ జ‌రుగుతోంది. అనేక చోట్ల ప్ర‌జ‌లే స్వ‌చ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు.  అనేక చోట్ల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. 
* క‌డప ఆర్టీసీ డిపోలోని రెండు గేట్ల‌ను మూసివేసి బంద్ పాటిస్తున్న కార్మికులు.  ఎమ్మెల్యే అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబుతోపాటు కడప నగర అధ్యక్షుడు నిత్యానందరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో
* పులివెందుల  లో ప్ర‌శాంతంగా బంద్‌..  ఎంపీ వైయ‌స్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా 
* బస్సులను నిలిపివేసిన పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, దేవిరెడ్డి శంకర్ రెడ్డి త‌దిత‌రులున్నారు.
* రైల్వేకోడూరు మండలం కుక్కల్ దొడ్డి వద్ద వైయ‌స్సార్ సీపీ ఎమ్మెల్యే కొరుముట్ల  ఆధ్వర్యంలో వైయ‌స్సార్‌సీపీ నాయ‌కులు, కార్యకర్తల ఆందోళన
* చెన్నై - హైదరాబాద్ జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు... 
* బద్వేల్ లో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో బంద్... స్థానిక బస్టాండ్ వద్ద ప్రజాసంఘాలు ధర్న 
Back to Top