బాబు మోసం మీదే బంద్‌

హైద‌రాబాద్‌) ప్ర‌త్యేక హోదా మీద ప్ర‌జ‌ల్ని మోసం చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుకి ద‌క్కుతుంద‌ని వైయ‌స్సార్సీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు అభిప్రాయ ప‌డ్డారు. హైద‌రాబాద్ లోట‌స్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 
చంద్ర‌బాబు నాయుడు స్వాతంత్ర‌ స‌మ‌ర స‌మ‌యంలో జ‌న్మించి ఉంటే దేశానికి స్వాతంత్రం వ‌చ్చేదీ కాద‌ని రాంబాబు ఎద్దేవా చేశారు. ప్ర‌జాస్వామ్య యుతంగా చేస్తున్న బంద్ ల‌ను విమ‌ర్శిస్తున్న బాబుని చూస్తుంటే ఇటువంటి అనుమానాలే క‌లుగుతున్నాయ‌ని ఆయ‌న వివరించారు.  ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం చంద్ర‌బాబు కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఎందుకు నిల‌దీయ‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

మ‌రిన్ని విష‌యాలు ఆయ‌న మాటల్లోనే...
* ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కున్న కేంద్ర‌మంత్రి వ‌ర్గంలో టీడీపీ మంత్రులు ఎందుకు కొన‌సాగుతున్నారు. 
* చంద్ర‌బాబే ఏపీకి ప్ర‌త్యేక హోదా రాకుండా ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారు
* చంద్ర‌బాబు జ‌పాన్ త‌ర‌హా నిర‌స‌న‌లు తెల‌పాల‌ని చెప్ప‌డం సిగ్గుచేటు
* ఆనాడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు బంద్‌లు చేయ‌లేదా..?
* దేశ ప్ర‌ధాని మోడీ ప్ర‌భుత్వంలో చంద్ర‌బాబు భాగ‌స్వామి
* ప్ర‌త్యేక హోదా విష‌యంలో ప్ర‌ధాని మోడీతో మాట్లాడే అవ‌కాశం రాలేదా చంద్ర‌బాబు..?
* కేంద్రప్ర‌భుత్వాన్ని ప్ర‌త్యేక హోదా విష‌యంలో నిల‌దీయ‌న‌ప్పుడు సీఎం ప‌ద‌వికి అనర్హులు
* ప్ర‌త్యేక హోదా వ‌ల్ల కలిగే ప్ర‌యోజ‌నాల‌ను వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అంద‌రికీ వివ‌రించారు.
* ఆగ‌ష్టు 2వ తేదీన జ‌రిగే ఆంధ్రప్ర‌దేశ్ బంద్‌కు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు స‌హాక‌రించాల‌ని కోరారు

తాజా వీడియోలు

Back to Top