బ్యాన్‌ ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి

– వైయస్‌ జగన్‌ పాదయాత్రలో ఫ్లకార్డ్సుతో యువత ప్రదర్శన
– వైయస్‌ఆర్‌ కుటుంబంపై ఎల్లోమీడియా విషం చిమ్ముతుంది
తూర్పు గోదావరి: రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని టార్గెట్‌ చేసి విషం చిమ్ముతుందని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు మండిపడ్డారు. ప్రకాశం జిల్లాకు చెందిన విలియం కేరి అధ్వర్యంలో యువకులు బ్యాన్‌ ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి అంటూ ఫ్లకార్డులు పట్టుకొని వైయస్‌ జగన్‌ పాదయాత్రలో పాల్గొన్నారు. ఎల్లోమీడియా వైయస్‌ జగన్‌ కుటుంబంపై కుట్రపూరిత విషం చిమ్ముతుందని విలీయం కేరి మండిపడ్డారు. అసత్యాలు ప్రచారం చేసి రాష్ట్రాన్ని, యువతను తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన మీడియా ఇవాళ ఒక కుటుంబంపై కక్షగట్టడం దారుణమన్నారు. చంద్రబాబు కోసం ఓ వర్గం మీడియా వైయస్‌ జగన్‌పై విష ప్రచారం చేస్తుందన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మాలాంటి యువత వైయస్‌ జగన్‌కు తోడుగా ఉంటుందని చెప్పారు. బీజేపీతో కుమ్ముకు అయ్యింది ఎవరో అందరి తెలుసు అన్నారు. వైయస్‌ఆర్‌సీపీ బీజేపీతో కుమ్మక్కు అయితే ఇలాంటి ఈడీ కేసులు ఎందుకు ఉంటాయని నిలదీశారు. వైయస్‌ జగన్‌ సింగిల్‌గా ప్రజల కోసం నడుస్తున్నారన్నారు. పొగతాగడం ఆరోగ్యానికి హాని కరమైనట్లు ఇలాంటి మీడియా కూడా ఎంతో హానికరమన్నారు. ఇలాంటి మీడియాను బ్యాన్‌ చేయాలని విలీయం కేరి డిమాండు చేశారు. 
 
Back to Top