హోదా ఆకాంక్షపై పోలీసుల ఉక్కుపాదం

అమరావతి: ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మోసానికి నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టింది. హోదా కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు తెల్లవారుజాము నుంచి వైయస్‌ఆర్‌ సీపీ నేతలు, ప్రజలు, ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నారు. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన చంద్రబాబు ప్రజాబంద్‌ను పోలీసుల చేత అణగదొక్కించే ప్రయత్నం చేస్తున్నారు. శాంతియుత ఆందోళనకు దిగిన వైయస్‌ఆర్‌ సీపీ నాయకులను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. కందుకూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి, ఒంగోలు బాలినేని శ్రీనివాస్‌రెడ్డిని హౌస్‌ అరెస్టులు చేశారు. అదే విధంగా విజయనగరం జిల్లాలో ఎమ్మెల్సీ కొలగట్ల, మజ్జి శ్రీనివాసరావులను అరెస్టు చేశారు. గుంటూరు, నరసరావుపేటల్లో ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ముస్తఫాలను అరెస్టులు చేశారు. 
Back to Top