డబ్బులు పంచుతూ పట్టుబడ్డ బాలకృష్ణ

  • నంద్యాలలో టీడీపీ నీచ రాజకీయాలు
  • యథేశ్చగా డబ్బుల పంపిణీ
నంద్యాలః టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నంద్యాలలో డబ్బులు పంచుతూ నీచ రాజకీయాలకు తెరలేపారు.  ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. నిన్నటి నుంచి ప్రచారం నిర్వహిస్తూ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. డబ్బుల మూటలతో ప్రచారం చేస్తున్న బాలకృష్ణ సహా టీడీపీ నేతలపై చర్యలకు   వైయస్సార్సీపీ ఈసికి ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తోంది.  మరోవైపు, వైయస్ జగన్ కు ఉన్న ప్రజాధారణను తట్టుకోలేక టీడీపీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోంది. వైయస్ జగన్ మీటింగ్ లకు జనం రాకుండా రోజూ రూ. 300 ఇచ్చి రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నారు. సాయంత్రం మళ్లీ వారిని టీడీపీ నేతలు ఇళ్లకు పంపిస్తున్నారు. నంద్యాలలో గత పదిరోజులుగా ఇదే తంతు నడుస్తోంది. మంత్రులు, టీడీపీ నాయకుల కనుసన్నల్లో ఇదంతా జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు.  అవినీతి సొమ్మును వెదజల్లి చంద్రబాబు నంద్యాలలో దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నారు. ఈవిషయంలో ఈసీ జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 
Back to Top