ఉద్యమకారులకు బెయిల్ మంజూరు

పశ్చిమగోదావరి జిల్లాః తుందుర్రు ఉద్యమకారులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ వారు జైలు నుంచి విడుదల కానున్నారు. ఏడుగురికి  బెయిల్ మంజూరు చేస్తూ ...నిర్మాణంలో ఉన్న మెగా ఆక్వా ఫుడ్ పార్కు గ్రామానికి 50 మీటర్ల దూరంలో ఉండాలని న్యాయస్థానం షరతు విధించింది. బెయిల్ రావడంతో తణుకు సబ్జైలులో ఉన్న ఆరేటి సత్యవతి సాయంత్రం విడుదల కానుండగా, కోర్టు ఉత్తర్వులు అందగానే మిగిలిన ఆరుగురు నరసాపురం సబ్ జైలు నుంచి విడుదల అవుతారు.

కాగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 19న తణుకు సబ్ జైలులో సత్యవతిని పరామర్శించిన విషయం తెలిసిందే. ఉద్యమకారులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలవడంతో  ప్రభుత్వం వెనక్కి తగ్గింది.  గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేతపై ఇవాళ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆక్వాఫుడ్ పార్క్ ను వ్యతిరేకించిన  వారిపై ప్రభుత్వం ఇటీవలే అక్రమ కేసులు పెట్టి జైల్లో నిర్బంధించింది. 

తాజా వీడియోలు

Back to Top