భగ్నం చేయాలని చూస్తే నడిరోడ్డుపైనే దీక్ష..!

గుంటూరుః ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈనెల 26 నుంచి గుంటూరు ఉల్ఫా గ్రౌండ్ లో చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలకు తెరదీస్తోంది.  దీక్షకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తికావచ్చాక పోలీసులు అభ్యంతరం చెప్పడంపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.  ఇప్పటికే వైఎస్ జగన్ చేపట్టే దీక్షాస్థలికి పార్టీ కార్యకర్తలు  పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. పోలీసులు భారీగా మోహరించారు. ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తే అందుకు తీవ్ర పరిణామాలుంటాయని వైఎస్సార్సీపీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.   

తలశిల రఘురాం
ఏర్పాట్లను అడ్డుకోవాలని చూస్తే వైఎస్ జగన్ నడిరోడ్డుపైనే దీక్ష చేపడుతారని వైఎస్సార్సీపీ నేత రఘురాం అన్నారు. నెల 20వ తేదీనే జిల్లా ఎస్పీని కలిసి జననేత దీక్షపై సమాచారమందించామని చెప్పారు. ట్రాఫిక్ సాకుతో ఇన్ని రోజుల  తర్వాత వచ్చి అభ్యతరం చెప్పడమేంటని ప్రశ్నించారు. 
ప్రభుత్వం అవరోధాలు సృష్టిస్తే నగరాన్ని దిగ్బంధించైనా దీక్ష కొనసాగేలా చూస్తామన్నారు. 
అంబటి రాంబాబు
ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్ష ఆగదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. అనుమతి ఇవ్వకుండా దీక్షను భగ్నం చేయాలని చూస్తే జిల్లా కలెక్టరేట్ ముందు అయినా వైఎస్ జగన్ దీక్షకు దిగుతారని స్పష్టం చేశారు. అరచేతిని అడ్డంపెట్టి సూర్యకిరణాలు ఆపలేరని...పోలీసుల జులుంతో దీక్షను అడ్డుకోలేరని అంబటి రాంబాబు అన్నారు.

తాజా వీడియోలు

Back to Top