బ‌ల‌హీన‌వ‌ర్గాల ఆశాజ్యోతి పూలే

నెల్లూరుః వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో మ‌హాత్మ జ్యోతిరావు పూలే జ‌యంతి వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్ సీపీ కార్యాల‌యంలో జిల్లా అధ్య‌క్షుడు, స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి పూలే చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, కాకాణిలు క‌లిసి పార్టీ కార్యాల‌యం నుంచి ర్యాలీగా వెళ్లి న‌గ‌రంలోని జ్యోతిరావు పూలే, సావిత్రిబాయ్ పూలే విగ్ర‌హాల‌కు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల అభ్యున్న‌తికి పూలే చేసిన సేవ‌ల‌ను కొనియాడారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

Back to Top