వెన్నుపోటు చంద్రబాబు నైజం

తిరుపతి: ఎంతటి వారికైనా అవలీలగా వెన్ను పోటు పొడిచే అలవాటు చంద్రబాబుకు పుట్టుకతో వచ్చిందేనని వైయస్‌ఆర్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి అన్నారు. గురువారం కనికాపురం గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్య మంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడంతో ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలను ఆర్దికంగా ఆదుకోక పోయిన రోడ్లు, ఇళ్లు, తాగునీరు అందిస్తే అదే చాలన్నారు. ఓట్లకోసం టీడీపీ వస్తే ప్రజలు తరిమికొట్టేలా ఉన్నారని హెచ్చరించారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో అధ్యక్షుడు వి.లోకనాధరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు భాస్కర్‌రెడ్డి, జేమ్స్,ప్రభాకర్‌రెడ్డి,మునిరామయ్య,అంకయ్య,రాష్ట్ర ఎస్సీసెల్‌ సంయుక్త కార్యధర్శి ఆశీర్వాధం,జిల్లా ఎస్సీసెల్‌ కార్యదర్శి గోపినా«ద్‌ పాల్గొన్నారు

Back to Top