బాబు.. షేం షేం!

తాను మేధావిన‌ని, త‌న‌ది 2020 విజ‌న్ అని సొంత డ‌బ్బా కొట్టుకుంటూ ఉంటాడు ఏపీ సీఎం చంద్ర‌బాబు. అయితే అదంతా ఉత్తిదే అని తేలిపోయింది. ఆయ‌న‌కు రాష్ట్ర మ్యాప్‌లో ఏ జిల్లా ఎక్క‌డ ఉంటుందో కూడా తెలియ‌ద‌ని స్ప‌ష్ట‌మైంది. ఇలాంటి వ్య‌క్తి ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం కావ‌డం రాష్ట్ర ప్ర‌జ‌లు చేసుకున్న దౌర్భాగ్యం. ఈయ‌న ప్ర‌పంచం గ‌ర్వించ‌ద‌గ్గ రాజ‌ధానిని నిర్మిస్తార‌ట‌... అభివృద్ధిలో రాష్ట్రాన్ని నంబ‌ర్ వ‌న్ చేస్తార‌ట‌... వింటుంటుంటేనే న‌వ్వొస్తోంది. ఇంకా బాబు ఏం చెబుతున్నారో చూడండి.. `` సన్ రైజ్ రాష్ట్రంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా పర్యాటక రంగంలో పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన ల‌భిస్తోంది .  ఏడాది కాలంలో రూ.1800 కోట్ల పర్యాటక ప్రాజెక్టులు రాష్ట్రానికి  వ‌చ్చాయి. ఇప్పటికే ప్రైవేటు రంగంలో 160 ప్రాజెక్టుల పనులు మొదల‌య్యాయి. అటు ప్రభుత్వం కూడా రూ. 190 కోట్ల విలువైన 90 ప్రాజెక్టులను పూర్తి  చేసింది`` అని చంద్ర‌బాబు త‌న పార్టీ అఫిషియ‌ల్ ఫేస్ బుక్‌లో పోస్టు కూడా పెట్టుకున్నారు.

Back to Top