బరితెగించిన బాబు..నియంత పాలన

హైదరాబాద్ఃస్విస్ చాలెంజ్ విధానమంతా లోపభూయిష్టమని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి అన్నారు. ఇది స్విస్ చాలెంజ్ లా లేదని సూట్ కేస్ చాలెంజ్ లా ఉందని దుయ్యబట్టారు . ప్రజాతీర్పు, న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు వేటిపైనా బాబుకు  గౌరవం లేదని మండిపడ్డారు. ప్రక్రియను నిలిపేయాలని కోర్టు స్టే ఇచ్చినా కూడా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదన్నారు. రాజధాని ముసుగులో బాబు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని కాకాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం బరితెగించి ప్రజల సొమ్మును దోచుకుంటూ నియంత పాలన సాగిస్తున్నాడని నిప్పులు చెరిగారు.

తాజా ఫోటోలు

Back to Top