వైయస్ జగన్ ప్రతిష్టను దిగజార్చేందుకు బాబు కట్టుకథలు

హైదరాబాద్ః ప్రయాణికుల సేఫ్టీని పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి అన్నారు. కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనను టీడీపీ సర్కార్ తప్పుదోవ పట్టిస్తోందని ఫైర్ అయ్యారు. దుర్ఘటనకు కారణాలు విశ్లేషించి అవి జరగకుండా చూడాల్సిన ప్రభుత్వం...దాని గురించి మాట్లాడకుండా వైయస్ జగన్ పై కేసులు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజల దృష్టి మరల్చేందుకే చంద్రబాబు వైయస్ జగన్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.  ఎవరు ప్రశ్నించినా వాళ్లపై కేసులు పెట్టడం శోచనీయమని ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

Back to Top