మహానాడు వేదికగా బాబు పచ్చి అబద్ధాలు

హైదరాబాద్ః అవకాశాన్ని సంక్షోభంగా మార్చగల ఘనడు చంద్రబాబు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ను అవినీతి ప్రదేశ్ గా మార్చేందుకు మహానాడును వేదికగా చేసుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.  మహానాడులో  ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలపై చర్చించడం మానేసి...ప్రతిపక్ష నాయకుడిని తిట్టడమే పనిగా పెట్టుకోవడం దుర్మార్గమన్నారు.  ప్రజలు ఏం చెప్పినా వింటారన్న భ్రమలో బాబు మహానాడులో పచ్చి అబద్ధాలు చెబుతున్నారని కరుణాకర్ రెడ్డి ఫైరయ్యారు. చంద్రబాబు పనిగట్టుకొని వైయస్ జగన్ పై అబాంఢాలు వేస్తున్నారని కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే పట్టిసీమ, అమరావతి భూదందా విషయంలో సీబీఐతోగానీ, సిట్టింగ్ జడ్జితోగానీ విచారణ చేయించాలని సవాల్ చేశారు.

Back to Top