బాబు పాలన చూస్తే..సిగ్గేస్తుంది

పశ్చిమ గోదావరి: చంద్రబాబు పాలన
చూస్తుంటే సిగ్గేస్తుందని  వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు కోటగిరి శ్రీధర్‌ పేర్కొన్నారు.  గణపవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌
మనందరి కోసం, మన సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర
చేస్తున్నారన్నారు. పాదయాత్ర అంటే ప్రజల కోసం చేసే ప్రార్థన అన్నారు. వేలాది మంది
తమ సమస్యలను మన నాయకుడి దృష్టికి తెస్తున్నారన్నారు. జగనన్న మా సమస్యలు
పరిష్కరిస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌
రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి,
ప్రజల అవసరాలు తెలుసుకొని సీఎం అయ్యాక
మంచి పాలన అందించారన్నారు. అలాగే వైయస్‌ జగన్‌ కూడా అభివృద్ధి, సంక్షేమ పథకాలను
అందజేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాత్రం అర్ధరాత్రి పాదయాత్ర
చేశారని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యకర్తలతోనే పరిపాలన చేయాలని భావించిన
చంద్రబాబు జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేశారని విమర్శించారు.
సిగ్గేస్తుంది..సిగ్గేస్తుంది చంద్రబాబు పాలన చూసి సిగ్గేస్తుందని విమర్శించారు.
పేదవాడి కడుపు నింపేందుకు వైయస్‌ జగన్‌ ఆరాటపడుతున్నారన్నారు. ఆటోడ్రైవర్లు, రైతులు, మహిళలు, ఇలా అన్ని వర్గాలకు
అవసరమైన పథకాలను ప్రకటించారన్నారు. మనకు మంచి భవిష్యత్తు వైయస్‌ జగన్‌ ద్వారా
రాబోతుందని చెప్పారు. చంద్రబాబుకు అనుభవం ఉందని నమ్మి మోసపోయామన్నారు. పోలవరం
ప్రాజెక్టు చంద్రబాబు పుణ్యమా అని మూలనపడిందన్నారు. అమరావతి ఒక కలగా మారిందన్నారు.
రాజధాని చూపించమంటే సినిమాలు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం
మా పార్టీ ఎంపీలు రాజీనామా చేశారని, చంద్రబాబుకు దమ్ముంటే తన వద్ద ఉన్న
ఎంపీలతో రాజీనామాలు చేయించాలని సవాల్‌ విసిరారు. నాన్నగారు కోటగిరి విద్యాధర
రావుకు మంచి పేరు తెచ్చేందుకు వైయస్‌ జగన్‌ వెంట నడుస్తున్నానని చెప్పారు. వైయస్‌
జగన్‌ను చూసి నమ్మకం కలిగిందన్నారు. వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు అందరికి
చేరాయన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి మేలు చేసేందుకు వైయస్‌ జగన్‌ నవరత్నాలు
ప్రకటించారన్నారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం కాపాడేందుకు ఎన్‌టీఆర్‌ టీడీపీని
స్థాపించారని, చంద్రబాబు మాత్రం ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని
విమర్శించారు. వ్యవసాయం దండగా అన్న ఏకైక వ్యక్తి చంద్రబాబే అన్నారు. సోనియా
గాంధీతో కలిసి రాష్ట్రాన్ని విడగొట్టారన్నారు.  ఆంధ్రుల ఆత్మ
గౌరవాన్ని కాపాడేందుకు వచ్చిన వ్యక్తి కాబోయే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అని పేర్కొన్నారు.  జగనన్నను సీఎం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

Back to Top