టీడీపీకి రోజులు దగ్గర పడ్డాయ్‌

శావల్యాపురంః టీడీపీ హయంలో రాష్ట్రంలో దుర్మార్గ పాలన కొనసాగుతుందని వైయస్‌ఆర్‌ సీపీ గుంటూరు జిల్లా శావల్యాపురం మండల అధ్యక్షులు చుండూరి వెంకటేశ్వర్లు అన్నారు. ముళ్ళపాడు బస్సు ప్రమాద ఘటనపై భాధితులను పరామర్శించిన వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులు నమోదుకు నిరసనగా వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మండలస్థాయి అందోళన నిరసన కార్యక్రమం గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై ధర్నా కార్యాక్రమంలో చుండూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నాయకులపై ప్రభుత్వం కేసులు పెట్టటం హేయమైన చర్య అన్నారు. టీడీపీ హయంలో ఆరాచకాలు అన్యాయం పెరిగాయన్నారు. దివాకర్‌ బస్సు ప్రమాదంలో మృత్యువాత పడిన బాధితులను ఓదార్పుకు వచ్చిన వైయస్‌ జగన్‌పై అక్రమ కేసులు నమోదు చేయటం ప్రతిపక్షంపై వారికి ఉన్న గౌరవం అర్థంమవుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వపరంగా న్యాయం జరగకపోతే పార్టీ పరంగా ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చారించారు. కార్యాక్రమంలో వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు స్వర్ణాల వెంకటరావు,తూమాటి కబ్బయ్య,మొనపాటి శ్రీనివాసరావు,పద్మనాభుని చంటి,తూమాటి రవి,ప్రభు,కొత్త అనిల్‌రెడ్డి,మద్దికుంట ఏడుకొండలు,మిల్లు శ్రీను,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

Back to Top