బాబు రాజకీయ పునాదే..హత్యారాజకీయాలు

  • చంద్రబాబు, హంతక రాజకీయాలు అవిభక్త కవలలు
  • బాబు  పాలన నరకాసుర పాలనను తలపిస్తోంది
  • అబద్ధపు హామీలతో అన్ని వర్గాల ప్రజలను వంచించారు
  • బాబు పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్రమైన దుర్భిక్షంలోకి నెట్టబడ్డారు
  • రాజకీయాల్లో వైయస్ జగన్ నైతిక సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు
  • వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి
నంద్యాలః చంద్రబాబు పాలన హిరణ్యకశ్యకుల కంటే రావణాసుర, దుశ్సాసునుల కంటే దుర్మార్గంగా ఉందని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. బాబు చంద్రకశ్యకుడిగా మారాడని ధ్వజమెత్తారు. నారా చంద్రబాబు నాయుడి పాలన నరకాసురుని పాలనను తలపిస్తోంది గనుకే... ప్రతి ఏడాది  దీపావళి పండుగలో నరకాసురుని ఏవిధంగా కాలుస్తారో ఆవిధంగా టీడీపీ పాలనను కాల్చాల్సిన అవసరం ఉందని ప్రజల గొంతుకను వైయస్ జగన్ నంద్యాల బహిరంగ వేదికగా చెప్పారన్నారు. దాన్ని పట్టుకొని తెలుగుదేశం నాయకులు, మంత్రులంతా భూతాల్లాగ రాష్ట్రమంతా ఆవహించి ప్రేతాలుగా మారి  గగ్గోలు పెట్టడం దుర్మార్గమన్నారు. అబద్ధపు హామీలతో ప్రజల రక్తమాంసాల్ని పీల్చేసి, అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని చంద్రబాబుపై భూమన నిప్పులు చెరిగారు. నంద్యాలలో జరిగిన మీడియా సమావేశంలో భూమన మాట్లాడుతూ...టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లలో ఒక్క మంచి పని చేయకుండా మూడున్నర లక్షల కోట్లను దోచుకొని అందరి నియంతల కంటే దుర్మార్గమైన రీతిలో బాబు పాలన సాగిస్తుంటే...బాబు ముందు, వెనుక ఉన్న భూతాలకు అది స్వర్గంగా కనిపించడం దారుణమన్నారు. బాబు పాలనలో ప్రజలకు మేలు జరగకపోగా అందరికీ హాని జరుగుతోందని అన్నారు. రాష్ట్ర ప్రజలు తీవ్రమైన దుర్భిక్షంలోకి నెట్టబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 

బాబు వస్తే కరువు వస్తుంది. పొలాలు బీడులుగా మారి ఆకలికోసం అలమటించాల్సిన పరిస్థితి వస్తుంది. 90 శాతానికి పైగా మండలాలు కరువు మండలాలుగా మారాయి. ప్రకృతి, దేవుడు కూడ కనికరించని దుర్మార్గపు పాలన బాబుదని భూమన పైర్ అయ్యారు. కార్పొరేట్ సంస్థలకు సంక్షేమాన్ని అమ్మేశాడు. తాగే మంచినీటిని ప్రపంచబ్యాంకుకు అమ్మేశాడని బాబుపై భూమన విరుచుకుపడ్డారు. నారోడ్లపై తిరుగుతూ నాకు ఓటేయరా అని బెదిరించే వ్యక్తి ప్రపంచంలో బాబు తప్ప మరొకరు లేరన్నారు.  బాబు తన పాలనంతా స్వార్థానికి, అధికార దాహానికి వాడే దుర్మార్గుడు గనుకనే పాలనకు అర్హుడు కాదన్న ఐదుకోట్ల మంది ప్రజల గొంతుకను వైయస్ జగన్ వినిపించారన్నారు.  హింసాయుత రాజకీయాలను రెచ్చగొట్టే వ్యక్తిగా, హంతకుడిగా ప్రతిపక్ష నేతను  చిత్రీకరించడం దారుణమన్నారు. రాజకీయాల్లో నైతిక సాంప్రదాయాన్ని తీసుకొచ్చిన నాయకుడు వైయస్ జగన్ అని అన్నారు.  అనైతిక రాజకీయాలకు పాల్పడే బాబు విధానాలను జగన్ ఎండగడుతూ చక్రపాణిరెడ్డి చేత రాజీనామా చేయించి పార్టీలోకి చేర్చుకున్న వైనాన్ని కప్పిపుచ్చుకునేందుకే..... బాబు తాబేదారులు, ఆయన మెప్పు కోసం పాకులాడే ప్రసారమాధ్యమాలు పిచ్చి ప్రేలాపణలు పేలుతున్నారని భూమన ఫైర్ అయ్యారు. 

ప్రతిపక్ష నేతను పట్టుకొని  నీవు హంతకుడివి, సైకోవి, నీచుడివి, నిన్ను ఉరితీసినా పాపం లేదని టీడీపీ నేతలు మాట్లాడినప్పుడు...ఇప్పుడు సుద్దులు చెబుతున్న వాళ్లంతా అనైతికమని ఏనాడైనా మాట్లాడారా? అని భూమన ప్రశ్నించారు. రాజకీయాల్లో విలువలు పాటించాలి, మానవత్వం ఉండాల్నారు. అధికారం, స్వార్థం కోసం పనిచేయకూడదని...విశ్వసనీయత, విలువలు లేకపోతే రాజకీయాల్లో ఉండడం అనర్హత అని వైయస్ జగన్ వెలుగెత్తి చాటారన్నారు. రాష్ట్రంలో హంతక రాజకీయాలకు బాబుకు అవినాభావ సంబంధం ఉందని భూమన అన్నారు. హంతక రాజకీయాలు, బాబు అవిభక్త కవలలని చెప్పారు. బాబు రాజకీయ పునాదే హత్యారాజకీయాలు, స్వార్థపూరిత వంచనతో కూడుకున్నవని పేర్కొన్నారు. బాబు రాజకీయ తొలినాళ్లలోనే అవకాశ వాద ఎత్తుగడలకు తెరలేపారని, ఎన్టీఆర్ వీరాభిమాని మల్లెల బాబ్జి
చనిపోవడానికి బాబే కారణమని అన్నారు. 
Back to Top