జననేతపై బాబు అండ్ కో రాక్షసదాడి

రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ మోసం చేశారు
విచ్చలవిడిగా రాష్ట్రాన్ని దోచేస్తున్నారు
అవినీతి సామ్రాజ్యంగా మారుస్తున్నారు
బాబు, మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలి
కుట్రలు, దోపిడీ, అవినీతిని మానాలి
ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ప్రతిజ్ఞ చేయాలి
టీడీపీ సర్కార్ పై ధ్వజమెత్తిన భూమన

హైదరాబాద్ః హిట్లర్, నాదిర్ షాల కంటే కూడా దుర్మార్గమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబేనని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. 40 ఏళ్ల బాబు రాజకీయమంతా అరాచకమేనన్నారు. వైయస్ జగన్  చెప్పులతో కొట్టమంటేనే నిరసన కార్యక్రమాలు చేయిస్తున్న చంద్రబాబు...తనకు రాజకీయ బిక్ష పెట్టిన, పిల్లనిచ్చిన మేనమామపై చెప్పులు వేయించారే దానికేం సమాధానం చెబుతారని నిలదీశారు. వైస్రాయి హోటల్ దగ్గర ఎన్టీఆర్ పై చంద్రబాబు వేయించిన చెప్పులు ఇంకా అక్కడి పడి ఉన్నాయని ఎద్దేవా చేశారు.  అన్ని చెప్పులు విసిరిన ఘనత చంద్రబాబుదని దుయ్యబట్టారు. హామీల ఉల్లంఘనపై పోరాడుతున్న వైయస్ జగన్ పై... చంద్రబాబు చేయిస్తున్న దాడిని చూసి సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంటోందని భూమన అన్నారు.  

ఎన్నికల ముందు 600 వాగ్ధానాలు చేసిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కహామీని నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని  భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయాలని ప్రజల పక్షాన ప్రశ్నించిన ప్రతిపక్ష నేతపై...చంద్రబాబు తన తాబేదారులతో అమానవీయంగా దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆవేదన, ఆక్రోశం, కడుపుమంటను వైయస్ జగన్ తన మాటల్లో ప్రతిబింబిస్తే...తెలుగుదేశం నేతలు దాన్ని వక్రీకరించి మాట్లాడడం దారుణమన్నారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. 

మీరు ఓట్లు వేసి గెలిపించండి. మీ జీవితాల్లో వెలుగులు నింపుతా.   ఒక్క  రూపాయి కూడా రుణాలు కట్టనవసరం లేదు. మహిళల కనీళ్లు తుడవడమే నా లక్ష్యం. ప్రతి కులం సంక్షేమమే నా బాధ్యత.  బెల్ట్ షాపులు లేకుండా చేస్తాం. 20 లీటర్ల నీటిని ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా ఫ్రీగా ఇస్తామని ఎన్నో వాగ్ధానాలు ఇచ్చారు.  ప్రమాణం చేశారు. ప్రజలు ఇంత పెద్ద ఎత్తున అధికారమిస్తే ఒక్క హామీ అయినా నెరవేర్చారా బాబు అని భూమన ప్రశ్నించారు.  మా జీవితాలు బుగ్గి అయిపోయాయి. ఎన్నికల హామీల పేరుతో చంద్రబాబు మమ్మల్ని ఆడుకున్నారు.  బ్యాంకుల్లో ఉన్న బంగారం తెచ్చుకొనే పరిస్థితి లేకుండా పోయింది.  మా పుస్తెలు తెగుతున్న పరిస్థితి వచ్చిందని మహిళలు కన్నీరు పెడుతుంటే కనిపించడం లేదా చంద్రబాబు. రుపాయి కూడా మాఫీ కాక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుటుంటే నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తారా అంటూ భూమన చంద్రబాబుపై ధ్వజమెత్తారు.  

జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఉద్యోగం లేని వారికి నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. దాని ఊసేలేదు. బాబు నీవు చెప్పిన మాయమాటల వల్ల నిరుద్యోగుల భవిష్యత్ చిధ్రమైంది. ఏ ఒక్కరు రాష్ట్రంలో సంతోషంగా లేరు. ఇన్ని పాపాలు, తప్పులు, మోసాలు చేస్తున్న మిమ్మల్ని ప్రశ్నించడమే తప్పా..? అని భూమన నిలదీశారు. స్వార్థం, నీచం, కపటం అన్నీ కలబోసిన వ్యక్తి చంద్రబాబు అని భూమన నిప్పులు చెరిగారు. ప్రతిభావంతుడు, పోరాటయోధుడు, ఉద్యమ లక్షణాలు కలిగిన జననేతపై నిరంతరం దాడి చేయడమే లక్ష్యంగా బాబు కుట్రలు చేస్తున్నారని భూమన మండిపడ్డారు. 

హామీలపై చర్చ జరగాలని అసెంబ్లీలో  వైయస్ జగన్ పట్టుబడితే... చంద్రబాబు అండ్ కో భౌతికంగా దాడులు చేసేందుకు కూడా వెనుకాడలేదని భూమన అన్నారు.  ఒక్క రోజు కూడా చర్చకు అవకాశం ఇవ్వకుండా నిరంతరం వైయస్ జగన్ వ్యక్తిత్వంమీద దాడి చేశారని మండిపడ్డారు.   ఎందుకు పనికిరాని, మెదడు లేని కొందరు మంత్రులు వైయస్ జగన్ పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకోవడం సిగ్గుచేటని భూమన ధ్వజమెత్తారు. పోలీసులు ప్రభుత్వానికి కాపలా కుక్కల్లా మారారని భూమన మండిపడ్డారు. ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు టీడీపీ నేతలు కొన్ని వేల గడ్డివాములను కాల్చినా పోలీసులు ఒక్క కేసు కూడా పెట్టకపోవడం దారుణమన్నారు. విజయవాడలో ఓ కార్పొరేటర్ శరీరం కాలితే అడ్డుకున్న ఎస్సైపై విచారణ చేయిస్తానని బాబు మాట్లాడుతున్నాడని ఫైరయ్యారు. చంద్రబాబు దిష్టిబొమ్మ కాల్చాలంటే తమపై అనేక కేసులు, జైల్లు నోరుతెరుచుకొని ఉన్నాయని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ మోసం చేశారు. రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు. అవినీతి సామ్రాజ్యంగా మారుస్తున్నారు. మీరు చేస్తున్నప్రతి దాని వెనుక కుట్రలు, అవినీతి, దగా విలయతాండవం చేస్తున్నాయి గనుకనే.... వైయస్ జగన్ ఆమాట అనవలసిన అఘత్యం వచ్చిందన్నారు.  ఒక్క వాగ్ధానం కూడా నెరవేర్చకుండా సంకల్పదీక్ష పేరుతో బాబు ప్రతిజ్ఞలు చేయడం సిగ్గుచేటన్నారు. పార్టీకి సంబంధించిన వ్యవహారంలా ప్రజల చేత ప్రమాణం చేయించడం దుర్మార్గమన్నారు.  ఏ ప్రజలనైతే మోసం చేశారో ఆప్రజల ముందు...చంద్రబాబు, ఆయన తాబేదారులు ఇకపై దోపిడీ, మోసం, అవినీతి చేయను అని చేసిన సిన తప్పుకు లెంపలు వేసుకోవాలని ప్రతిజ్ఞ చేయాలన్నారు. వైయస్ జగన్ పై రాక్షస దాడి చేయడం మానుకోవాలని హితవు పలికారు. 
Back to Top