మోసం చంద్రబాబుది...శిక్ష ప్రజలు అనుభవించాలట

 రూ. 4 లక్షల కోట్ల అక్రమాలు బయటపడతాయన్న భయం
బాబును వెన్నాడుతోంది.

పశ్చాతాపం లేని వ్యక్తిని క్షమించాలా?

రాక్షసుడు మనిషిగా పుడితే చంద్రబాబులా ఉంటాడు.

ప్రత్యేక హోదాపై పూటకో డ్రామా ఆడుతున్నారు

కొల్లేరు ప్రాంతంపై అవగాహన ఉన్న వ్యక్తికి ఎమ్మెల్సీ
పదవి

కొల్లేరు సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో
అడుగులేస్తాం

కైకలూరు బహిరంగ సభలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి


కైకలూరు : చంద్రబాబు తన వైఫల్యాలు, చేసిన
తప్పులకు ప్రజలు వలయంగా ఉండి రక్షించాలంటూ 
సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.
నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా పీక నులిమిన చంద్రబాబు ఇప్పుడు తానేదో చేశానని బిల్డప్
ఇస్తూ  రోజుకో డ్రామా ఆడుతున్నారని
విమర్శించారు.  ప్రజా సంకల్పయాత్రలో భాగంగా
శనివారం సాయంత్రం కైకలూరులో నిర్వహించిన బహిరంగ సభలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి
ప్రసంగించారు. మహాభారతంలోని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతూ చంద్రబాబు పబ్బం
గడుపుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు డ్రామాలతో ప్రజలకు
రాజకీయాలంటే విశ్వాసం పోతోందన్నారు. గత నాలుగేళ్ల కాలంలో దాదాపు 4 లక్షల
కోట్లకుపైగా అక్రమార్జనకు పాల్పడిన చంద్రబాబుకు తన మోసాలు, అవినీతి బయటపడతాన్న  భయం పట్టుకున్నందునే ఇప్పుడు తాను చేసిన
తప్పులకు ప్రజలే రక్షణ కవచంలా ఉండి కాపాడాలంటూ మాట్లాడుతున్నారని వైయస్ జగన్
అన్నారు.

తిరుమల పాలకవర్గంలో తిరుపతి బోర్డులో ఒకవైపు
బిజెపి వారిని సభ్యులుగా నియమిస్తూ, మరోవైపు ఎన్నికల్లో లబ్ధి కోసం బిజెపి
అధ్యక్షులు అమిత్ షాపై దాడి చేయిస్తారనన్నారు.  ప్రజల ఆగ్రహంతోనే బిజెపి నేతపై దాడి జరిగిందని
చెప్పుకునే కనీస ధైర్యం కూడా చంద్రబాబుకు లేదని, తూచ్ అంటూ మళ్లీ యూటర్ను
తీసుకున్నారని ఎద్దెవా చేశారు. గత నాలుగేళ్లుగా ప్రతి విషయంలోనూ చంద్రబాబు వైఖరి
ఇలానే ఉందన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే 
ప్రతి గ్రామంలోనూ సమ్మర్ స్టోరేజి ట్యాంకులను కట్టి నీటి ఎద్దడి
లేకుండా యుద్ద ప్రాతిపదికిన చర్యలు చేపడతామని, కొల్లేరు ప్రాంతానికి సంబంధించిన
సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం ఈ ప్రాంతంపై
పూర్తి అవగాన వ్యక్తినే ఎమ్మెల్సీగా చట్టసభలకు పంపుతామని ప్రకటించారు. కాంటూరు కు
సంబంధించి రీసర్వే చేయిస్తామన్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబు చేస్తున్న మోసాలకు
కైకలూరు నియోజకవర్గంలోని పరిస్థితులే ప్రత్యక్ష నిదర్శనాలు అని పేర్కొన్నారు.

వైయస్ జగన్ ఇంకా ఏమన్నారంటే....

బాధలు చెపుతూ కష్టాలను చెప్పుకుంటూ నా భుజాన్ని
తడుతూ మేమంతా మీ వెంట ఉన్నామంటున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

కొల్లేరు సరస్సును 5 నుంచి 3 వ కాంటూరుకు కుదించి
రైతులకు, నిరుపేదలకు పట్టాలిస్తామని చెప్పిన చంద్రబాబు నాలుగేళ్లుగా
పట్టించుకోలేదంటూ ఈ ప్రాంత వాసులు వాపోతున్నారు.

నాలుగేళ్లపాటు అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ
బిజెపితో కలిసి కాపురం చేసినంత కాలం, మంత్రులుగా కొనసాగినంత కాలం ప్రత్యేక హోదా
ఎలాగుర్తుకు రాలేదో అలాగే కైకలూరు, కొల్లేరు సమస్యలు కూడా వారికి  గుర్తుకు రాలేదు. ఇప్పుడు విడాకులు ఇచ్చిన తరువాత కొత్త
పెళ్లికూతురు కోసం వెతుకున్నట్లుగా కొల్లేరు గుర్తుకు వస్తోంది.

ఏరు దాటాక తెప్ప తగలపెట్టడం చంద్రబాబు నైజం అని
రైతన్నలు గ్రహించారు. కొల్లేరు ప్రాంతం వాసులు వారి సమస్యలు చెప్పుకుంటుంటే చాలా
బాధ వేసింది. ఈసమస్య సుప్రీం కోర్టు పరిథిలో ఉండటమే కాకుండా, అనేక చిక్కుముడుల్లో
డోలాయమానంగా ఉంది. ఇటువంటివన్నీ తెలిసి, మైకు పట్టుకుని మోసం చేయడం, అబద్దాలు
చెప్పడం, ధర్మమమేనా.

ఇటువంటి స్థితుల్లో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు
చాలా చిత్తశుద్ధితో సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాలి, కానీ మన దురదృష్టవశాత్తూ
ఇలాంటివి జరగలేదు.ఇలా మోసం చేసేవాడు మనకు కావాలా అంటూ
నిలదీశారు.

 దేవుడి
కరుణించి మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సమస్య పరిష్కారానికి  చిత్తశుద్ధితో
అడుగులేస్తుంది. కొల్లేరు ప్రాంతం నుంచి సమస్యపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిని
ఒకరిని ఎమ్మెల్సీగా చట్టసభల్లోకి తీసుకుని వస్తామనీ, కొల్లేరు సమస్య పరిష్కారానికి  రాష్ట్ర
ప్రభుత్వం అండగా ఉంటూ, సిఎంగా మీ వెంట నడుస్తానంటూ  వైయస్ జగన్ భరోసా ఇచ్చారు.  1999 లో చంద్రబాబు హయాంలో  ఈప్రాంతంలోసర్వే సరిగా చేయలేదనీ, కాంటూరు హద్దులు సరిగా చేయలేదు, కొన్ని గ్రామాలను
అన్యాయంగా కలిపేశారంటూ స్థానికులు తనకు 
ఫిర్యాదు చేశారనీ, అధికారంలోకి వస్తే, వెంటనే రీ సర్వే కు ఆర్డర్ చేస్తామని
కాంటూరు హద్దులను నిర్దేశించడంలో జరిగిన తప్పులను సరిదిద్దుతామని భరోసా ఇచ్చారు.
వీలైనంత ఎక్కువ భూములను బయటకు తీసి ప్రతి పేదవాడికి పంచే ఏర్పాటు చేస్తామన్నారు.
మరోవైపున సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలను కూడా పరిష్కరించే
దిశలో అడుగులు వేస్తాం వీలైనంత తర్వగా పరిష్కారమయ్యేలా అన్ని చర్యలు
తీసుకుంటామన్నారు.

 స్థానికంగా ఉన్న మంచినీటి సమస్యను
శాశ్వతంగా పరిష్కరించేందుకు వీలుగా ఉప్పుటేరు ముఖ ద్వారంలో ఒక రెగ్యులేటర్
కట్టేందుకు యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకుంటామన్నారు. గడచిన నాలుగేళ్లుగా ఈ
విషయాన్ని అనేక సార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోడం
దురదృష్టకరమన్నారు. అలాగే పెద్దలంక డ్రైన్ మీద గతంలో ఉన్న అండర్ టన్నెల్ కు గేట్లు
ఏర్పాటు చేసే పనులను కూడా చేపడతామని ప్రకటించారు.

కృష్ణా డెల్టాకు శివారు ప్రాంతమైన కైకలూరులో ఒక్క
పంటకు నిర్ధిష్టంగా నీళ్లిచ్చే పరిస్థితి లేదని, మినుములాంటి ఆరుతడి పంటలు వేసినా
గిట్టుబాటు ధరలు రాక రైతులు నానా అవస్థలు పడుతున్నారని వైయస్ జగన్ అన్నారు. డెల్టా
ఆధునీకరణకు చంద్రబాబు హయాంలో చేసింది శూన్యమన్నారు.

ఇటువంటి పరిస్థితులు రాకూదనే, నాన్నగారి హయాంలోనే
శంఖుస్థాపన చేసి,  పులిచింతల ప్రాజెక్టును
దాదాపు పూర్తి చేసినా, కేవలం 145 కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వకుండా, ఫలాలు
ప్రజలకు అందకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటే పాలకుల తీరు అవగతమవుతోంది.
పులిచింతల ద్వారా రెండు పంటలకు నీళ్లిచ్చే అవకాశమున్నా, చంద్రబాబు నిర్లక్ష్యంతో
ఏ ప్రాంతానికి కూడా నీళ్లురాని పరిస్థితుల్లో వ్యవసాయాన్నే పక్కకు బెట్టాల్సిన
దుస్థితి ఏర్పడింది.

మంచినీటి ట్యాంకులు ఉప్పునీటి మయమై చేపల చెరువులన్నీ
రొయ్యల చెరువులుగా మారిపోయినా ఆ రొయ్యలకి కూడా గిట్టుబాటు ధరలు రాకుండా చంద్రబాబు దళారీ
వ్యవస్థ పేట్రేగి పోతూ రైతన్నలను సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం
పనిచేస్తోందో లేదో అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు.

కైకలూరు ప్రాంతంలో వ్యవసాయం, పరిశ్రమలు లేక ,
ఆక్వా గిట్టుబాటు కాక  వలసలు ఎక్కువై బయటకు
పోతుంటే , చంద్రబాబు నాయుడు మాత్రం తన సుందర ముఖారవిందాన్ని చూసి నాలుగేళ్ల కాలంలో
20 లక్షలపెట్టుబడులు, 40 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయంటూ ప్రచారం చేసుకుంటున్నారనీ,
ఈ ఉద్యోగాలు ఎక్కడైనా కనిపించాయా అంటూ ప్రజలను ప్రశ్నించారు.

కైకలూరు నియోజకవర్గంలో  109 గ్రామాలు ఉంటే, 99 గ్రామాల్లో నీళ్లు లేని
పరిస్థితి అల్లాడుతుంటే ఇంతకంటే దారుణమమైన పాలన ఉందా, ప్రతి రోజూ 20,30 రూపాయలు
ఖర్చు పెట్టి తాగేనీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితులున్నాయన్నారు.  ఎన్నికలప్పుడు ఏమన్నాడు, ప్రతి పేదవాడికి 3
సెంట్ల స్థలం, ఇళ్లు కట్టిస్తానన్నాడన్నా ఒక్క ఇళ్లు కట్టించలేదన్నా అంటూ పేదవాళ్లు వాపోతున్నారు. అసలు నీళ్లివ్వకపోయినా నీటి తీరువా కింద మాత్రం ప్రతి ఎకరాకు వందలు
వసూలు చేస్తున్నారని విమర్శించారు. 
అధికారంలోకి వచ్చిన రెండు పంటలకు నీళ్లిచ్చేలా చూడటంతోపాటు, చేపల చెరువులకు
నీళ్లిచ్చే వ్యవస్థను తీసుకని వస్తామని, ప్రతి గ్రామంలోని నీటి స్టోరేజి
ట్యాంకులు, నీటి చెరువులు కట్టి మంచినీటి ఎద్దడి లేకుండా చేస్తానంటూ హామీ ఇచ్చారు.

నాలుగేళ్లుగా చంద్రబాబు పాలన చూస్తున్నాము, సిఎం కావడానికి
ఆయన అన్న మాటలను గుర్తుకు తెచ్చుకోవాలంటూ, రైతుల రుణాలను భేషరతుగా మాఫీ కావాలంటే,
బ్యాంకుల్లోని బంగారం ఇంటికి తిరిగి రావాలంటే బాబు కావాలంటూ , టీవీల్లో అడ్వర్టైజ్
మెంట్ లు ఇచ్చుకున్న విషయాన్ని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాయకు అమలు చేయని , ఇచ్చిన మాటలు మార్చడానికి ఆయన మనిషా
అంటూ తీవ్రంగా ప్రశ్నించారు.

ఒక రాక్షసుడు మనిషిగా పుడితే ఎలా ఉంటాడో చంద్రబాబున
చూస్తే అర్థమవుతుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిరుద్యోగులను ఉపాథి ఇస్తానంటూ,
లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తానంటూ మోసం చేశారన్నారు.

ప్రత్యేక హోదాతో నిరుద్యోగులకు ఉద్యోగాలు
వస్తాయన్న సంగతి తెలుసు కాబట్టే వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ హోదా కోసం పోరాడుతోందని
చెప్పారు. చంద్రబాబు మాత్రం ఎన్నికలకు ముందు హోదా సంజీవిని అని, 5,10 కాదు
15 ఏళ్లు హోదా తీసుకువస్తామని ప్రచారం చేసుకున్నారు. కానీ ఎన్నికలయ్యాక చంద్రబాబు
మోసం చేసి ప్లేట్ ఫిరాయించారన్నారు. హోదా ఏమైనా సంజీవినా అని, హోదా ఉన్న ఈశాన్య
రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయంటూ ఎదురు ప్రజలకు క్లాస్ పీకడం మొదలెట్టారనీ, కోడలు
మగపిల్లాడిని కంటానంటే, అత్త వద్దంటుందా అంటూ వ్యాఖ్యలు చేసిన తీరును జగన్ వివరించారు.

హోదా కోసం వైయస్ ఆర్ కాంగ్రెస్ చేస్తున్న ఆందోళనలు, కార్యక్రమాలను, నిరసనలను, బంద్లను , చివరకు ఎంపిలు రాజీనామా చేస్తూ పోరాడితే , వాటన్నిటిని గొంతు నులిమి నలిపేసిన ఈ పెద్దమనిషి
ఎన్నికలు దగ్గరపడే సరికి డ్రామాలు మొదలెట్టారని జగన్ అన్నారు. ఇలాంటి డ్రామాలతో
ప్రజల్లో రాజకీయాలంటే విశ్వాసం కోల్పోతున్నామన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ఎంపిలు
రాజీనామాలు చేసిన నాడు, టిడిపి ఎంపిలతో రాజీనామాలు చేయించి ఉంటే, కేంద్రం
దిగివచ్చేదని, హోదా ఇవ్వక తప్పని ప రిస్థితులు ఏర్పడేవనీ,  కానీ చంద్రబాబు నాయుడు మాత్రం కొంగ జపాలు, దొంగ దీక్షలు చేశారన్నారు.

ఒకవైపు కర్నాటకలో ఓటర్లను ప్రభావితం చేయడానికి కింద
తిరుపతిలో బిజెపి అధ్యక్షులు అమిత్ షాపై రాళ్ల దాడి చేయిస్తారనీ, కానీ పైన
తిరుమలలో మాత్రం బిజెపికి చెందిన వారిని పాలక మండలిలో సభ్యులుగా నియమిస్తారనీ
ఇదే చంద్రబాబు ద్వంద వైఖరికి ప్రత్యక్ష్య రుజువు అని అన్నారు. రాళ్లు వేయించేంది
ఆయనే, దాన్ని తూచ్ అంటూ ఖండించే వ్యక్తి కూడా ఆయన అని విమర్శించారు.

చంద్రబాబు వైఖరి చూస్తుంటే భారతంలోని ఉత్తర కుమార
ప్రగల్భాలు గుర్తుకు వస్తున్నాయని, అంతపురంలో తనంత వాడు లేరంటూ విర్రవీగే ఉత్తర
కుమారుడికి, యుద్దభూమిలో అడుగుపెట్టగానే ముచ్చెమటలతో ఒళ్లంతా తడిసిపోతుందని
చంద్రబాబు నైజం కూడా అలానే ఉందన్నారు.  

గత నాలుగేళ్లుగా మట్టి,ఇసుక, బొగ్గు, భూములు
వేటినీ వదలకుండా దోచుకున్న 4 లక్షల కోట్లకు పైగా దోపిడీ బయటపడి, తనపై కేసులు
పెడతారమోననే భయం చంద్రబాబుకు  పట్టుకుందనీ,
దానిపై విచారణ జరిపిస్తారని ఇప్పుడు ప్లేటు మార్చారన్నారు. తన డ్రామా స్క్రిప్టును
మార్చుకుని, తాను హోదా కోసం పోరాటం చేస్తుంటే, బిజెపి వారు తనపై కేసులు పెట్టి అణచివేయాలని
చూస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారన్నారు. హోదా కోసం చెమటోడ్చి పోరాడుతున్నట్లుగా
బిల్డప్ ఇస్తూ ఒక్క రోజు దీక్ష కోసం 30 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. ఇలా చెప్పుకుంటూ
తనకు ఏమైనా జరిగితే రక్షణ వలయంగా  ప్రజలంతా ఉండాలని కోరుకోవడం ఆశ్చర్యంగా
ఉందన్నారు. 

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన బాబును, పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులో
అక్రమాలకు పాల్పడి, రాజధాని భూముల పేరిట తన అనునాయూలకు భూములు కట్టబెడుతూ, కాల్
మనీ రాకెట్ లో నిందితులను కాపాడిన బాబును రక్షించడానికి ప్రజలు ముందుకు రావాలట.
వీటన్నిటిపై విచారణ జరిగితే, ప్రజలు తనను కాపాడాలన్న బాబు తీరును ఆయన ఎండగట్టారు.
నేరం బాబు చేస్తాడు, లంచాలు బాబు మేస్తాడు, శిక్ష పడకుండా ప్రజలే ఆ శిక్ష
అనుభవించేలా చూడాలంటూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చేసిన
తప్పులకు ఎలాంటి పశ్చాతాపం వ్యక్తం చేయని ఇటువంటి వ్యక్తిని రక్షించాలా,
శిక్షించాలా అని అడి అడిగారు. ఇలాంటి వారని బంగాళా ఖాతంలో కలిపేయాలని ఆయన
పిలుపునిచ్చారు.

అనంతరం ఆయన నవరత్నాల్లో రైతాంగం, వ్యవసాయం కోసం
అమలు చేయనున్న కార్యక్రమాలను వివరించారు. 

Back to Top