చంద్రబాబు అడుగుపెడితే ధ్వంసమే

కంప్యూటర్ కు   కూడా అబద్దాలు చెప్పడం నేర్పించగల
దిట్ట బాబు

రివర్స్ లో విశాఖ అభివృద్ధి

గజదొంగల కేబినెట్ లో సంక్షేమం గురించి చర్చించరు

బాబు ఏ కార్యక్రమం చేపట్టినా స్కాంలే 

భాగస్వామ్య సదస్సులో తిండి ఖర్చే 53 కోట్లు

ఆటో డ్రైవర్ల లాగేనే టాక్సీ డ్రైవర్లకు ఏటా పదివేలు

విశాఖ బహిరంగ సభలో జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి 

విశాఖపట్టణం :

అధికారంలోకి వచ్చిన తరువాత ఆటో డ్రైవర్లకు
ప్రకటించినట్లుగానే సొంతంగా టాక్సీ ఉన్న డ్రైవర్లకు కూడా ఏటా 10 వేలు ఇస్తామని
వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.  ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్గంలో పేదల
సంక్షేమానికి సంబంధించిన అంశాలపై కాకుండా, బినామీలకు శనక్కాయలు, బిస్కట్ల మాదిరిగా
భూములను కట్టబెట్టడంపైనే చర్చలు జరుగుతాయని అన్నారు. మహానేత వైయస్ ఆర్ హయాంలో
విశాఖ అభివృద్ధి టాప్ గేర్ లో జరిగితే చంద్రబాబు నాయుడి హయాంలో విశాఖ నగరం రివర్సు
గేర్ లో వెళుతోందన్నారు. విశాఖ నగరంతో వైయస్ ఆర్ కు ఉన్న అనుబంధాన్ని వివరించారు. కంప్యూటర్
కూడా అబద్దాలు చెప్పడం నేర్పించగల దిట్ట చంద్రబాబు అని ధ్వజమెత్తారు. విశాఖపట్టణంలో
ఏ పథకం చేపట్టినా దాని వెనకాల స్కాంలే ఉంటున్నాయన్నారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలనే కాకుండా,
ముఖ్యమంత్రి హోదాలో సైతం చంద్రబాబు ఇచ్చిన హామీలకు దిక్కు దివాణం లేకుండా
పోతున్నాయన్నారు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో  విశాఖ నగరంలో కనిపించినదేమిటంటే దోచుకోవడమే అని
తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఆదివారం నాడు కంచరపాలెం
వద్ద,  నగరంలోని సముద్రంతో పోటీ పడుతూ
బహిరంగ సభకు తరలివచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్ జగన్ మోహన్ రెడ్డి
ప్రసంగించారు. ఈ సందర్భంగా  చంద్రబాబునాయుడు
, ఆయన మంత్రివర్గ సభ్యుల  అక్రమాలు,
అవినీతిపై విరుచుకుపడ్డారు.

ఆయన  ప్రసంగంలోని ముఖ్యాంశాలు

ఎటువైపు కన్నులు పెట్టి చూసినా ఎక్కడా ఖాళీ స్థలం
కనిపించడం లేదు.రోడ్లే కాక, భవనాల పై కూడా ఖాళీ స్థలం కనిపించడం లేదు. ఉదయం నుంచి
వేల సంఖ్యలో నాతో పాటు అడుగులు పడ్డాయి. ఆప్యాయతలు చూపుతున్నారు ప్రేమానురాగాలు
చూపెడుతున్నారు. వీరందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.

మహానేత వైయస్ హయాంలో విశాఖ నగరాన్ని టాప్ గేర్ లో
నడిపించారన్నా, నాన్నగారి హయాంలో ఉద్యోగాలు వచ్చాయి, ఐటి వచ్చిందన్నా, పేదవాడికి
ఇళ్లు కూడా వచ్చాయన్నా అంటూ ఇక్కడి ప్రజలు  చెప్పుకొచ్చారు.

నాన్నగారి హయాంలో విశాఖ నగరం అభివృద్ధి బాటలో టాప్
గేర్ లో ప్రయాణం చేస్తే, చంద్రబాబు హయాంలో రివర్స్ గేర్ లో ప్రయాణం చేస్తోంది. ఆ రోజుల్లోనే
అండర్ గ్రౌండ్ డ్రైనేజితో సహా అనే కార్యక్రమాల కోసం  1500 కోట్ల రూపాయలతో అభివృద్ది చేశారు.
నాన్నగారి హయాంలో  ర్యాపిడ్ ట్రాన్స్
పోర్టు సిస్టం కోసం రూ. 450 కోట్లతో రెండు బిఆర్ టిఎస్ రోడ్లను తీసుకోచ్చారు. కంచెరపాలెం
నుంచి సింహాచలం 6 లేన్లుగా తీర్చిదిద్దిగా ఘనత వైయస్ ఆర్ దే. అందులో  కేవలం 1.3 కి.మీ. మిగిలిపోయింది, ఆ రోడ్డును
ఇవాల్టికి కూడా పూర్తి చేయలేని అధ్వాన్న పరిస్థితులు ఉన్నాయి.

నాన్నగారి హయాంలో ఏకంగా 15 చోట్ల 15 కాలనీలు వచ్చాయి,  35 వేల ఇళ్లు కట్టించారు.
విశాఖ ఉక్కు కష్టాల పరిస్థితుల్లో ఉంటే, బిఐఎఫ్ ఆర్ కు పోయే పరిస్థితి ఉంటే
కేంద్రంతో పోరాడి, నిలబెట్టి, రెట్టింపు ఉత్పత్తి చేయగలడానికి కారణం వైయస్ఆరే. విశాఖలోని
ఎన్ టిపీసి ,హెచ్ పిసిఎల్ ల విస్తరణ అనేవి ఎప్పటికీ మరచిపోలేనవంటూ ప్రజలు
గుర్తించుకుంటారు.

అప్పట్లో  కొన్ని వందల కుటుంబాలని రోడ్డున పడకుండా
కాపాడటమే కాకుండా, షిప్ యార్డు కూడా నష్టాల ఊబిలో ఉంటే, రక్షణ శాఖలో విలీనం
చేయించారు. దువ్వాడ ఐటి క్యారిడార్, పరవాడలో ఫార్మా సిటీ,ఎస్ఇజెడ్, ఎక్కడ చూసినా
వేల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయంటే, ఆ రోజు మహానేత వైయస్ఆర్ చూపిన చొరవే కారణం

విశాఖ ఎయిర్ పోర్టుకు ఏదైనా వరద వస్తే,
విమానాలు ఎగరలేని పరిస్థితుల నుంచి, తప్పించడానికి కాలువలను నిర్మించి శాశ్వతమైన
చర్యలు తీసుకున్నదీ వైయస్ఆర్ అని గుర్తు చేశారు. అంతే కాకుండా వంద కోట్ల ఖర్చుతో
కొత్త టర్మినల్ నిర్మించి ఎయిర్ పోర్టు విస్తరణ పనులను కూడా పూర్తి చేశారు.

ఇలా అప్పటి 5 ఏళ్ల కాలంలో టాప్ గేర్ లో
ముందుకు పరుగెట్టిందన్నా అని ప్రజలు  చెప్పుకొచ్చారు.

ఈ నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూస్తే,
ఎన్నికలకు ముందే కాకుండా, ముఖ్యమంత్రి గా అధికారం చేపట్టిన తరువాత  చంద్రబాబు ఇచ్చిన హామీలకు దిక్కు దివాణం లేదు.

ఎన్నికలప్పుడు  విశాఖకు రైల్వే జోన్ అని ఊదరగొట్టారు.
నాలుగున్నర సంవత్సరాల పాటు కేంద్రంలో బిజెపితో సంసారం చేసినప్పుడు , రైల్వే జోన్
గుర్తుకు రాలేదు, ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదు. మొదటి భార్య బిజెపితో విడాకులు
తీసుకున్న తరువాత ఇప్పుడు గుర్తుకు వస్త్తున్నాయి. ఇప్పుడు మొదటి భార్య చెడ్డది, అంతకు
ముందు నాలుగున్నరేళ్లు మంచిది ఎలా అయ్యింది.

చంద్రబాబు జాతీయ క్రీడా ప్రాంగణాన్ని
నిర్మిస్తానన్నారు,అది ఎక్కడన్నా కనిపించిందా, నాన్నగారు కట్టిన స్టేడియం మాత్రమే
కనిపిస్తోంది. సిఎం హోదాలో ఇచ్చిన హామీ గిరిజన యూనివర్శిటీ ఎక్కడన్నా కనిపిస్తోందా
అని ప్రశ్నించారు.

ఐటి సిగ్నేచర్ టవర్స్ అంటూ మన అందరికీ
సినిమా, గ్రాఫిక్స్ చూపించారు, అవి ఎక్కడైనా కనిపించాయా

ముఖ్యమంత్రిగా అన్న మాటలు విశాఖకు
మెట్రో రైలట, ఎక్కడైనా కనిపించిదా, సైన్స్ సిటీ అట, ఎక్కడ ఉన్నాయా అని
ప్రశ్నించారు. ఈ పెద్ద మనిషి సిఎంగా మరో డీప్ వాటర్ పోర్టు కడతారట, ఉన్న
పోర్టులోనే ఉద్యోగాలు పోతుంటే, మరో పోర్టు ఎక్కడుంది, భీమిలి నుంచి కాకినాడ వరకు
తీరం వెంబడి రహదారి అట, సబ్బవరంలో భారీ పరిశ్రమ అట ఎక్కడైనా కనిపించిందా అని
నిలదీశారు. విశాఖలో కూచిపూడి కళాక్షేత్రం అట ఎక్కడైనా కనిపించిందా.

ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ చేసిన విశాఖకు
స్పోర్ట్స్ యూనివర్శిటి అట ఇలా అనేక రకాలుగా ఇచ్చిన మాటలకు  దిక్కు దివాణం లేదు. చంద్రబాబు మాటల మీద నిలబడే
నైజం ఇదీ.

కానీ ఈ నాలుగున్నరేళ్ల చంద్రబాబు
కాలంలో విశాఖలో చూసిందేమిటంటే

విశాఖలో ఎక్కడ ఏ భూమి కనిపించినా ఆ
భూమిని దోచేయడం కనిపించింది. భూములు దోచేయడం ఏ స్థాయిలో ఉందంటే, గతంలో పేదలకు ఇళ్ల
కోసం రాజీవ్ స్వగృహకు కేటాయిస్తే, చంద్రబాబు హయాంలో వాటిని లాక్కుని తన బంధువు, తన
బినామీ అయిన గీతం యూనివర్షిటీ మూర్తి గారికి ఇస్తారు.

విశాఖతో సహా రాష్ట్రంలో ఎక్కడ విలువైన
ప్రాంతాల్లో భూములున్నా, మంత్రివర్గం సమావేశం పెట్టి  పేదలు, రైతుల గురించి మంత్రివర్గంలో చర్చలు
జరగవు కానీ, ఆ గజదొంగల కేబినెట్ లో  బినామీలకు
శనక్కాయలకు, బిస్కట్లకు భూములు కేటాయించడంపైనే చర్చ జరుగుతుంది.

విశాఖలో ఇప్పటికే చాలా ఫైవ్ స్టార్
హోటళ్లున్నా, ప్రైవేటు వ్యక్తులకు లూలూ గ్రూపు అట, పేరుకు తగ్గట్టుగానే ఉంది వారి
వ్యవహారం, విశాఖ నగరంలో 9.1 ఎకరాలకు వెయ్యి కోట్ల విలువైన భూములను కట్టబెట్టారు.

అంతే కాకుండా ప్రైవేటు సంస్థకు 3.5
ఎకరాల స్థలం ఉంటే, పరిహారంగా ప్రైవేటు సంస్థకు విశాఖ వందల కోట్ల  విలువ చేసే భూములను అప్పన్నంగా కట్టబెట్టారు.
లులూ గ్రూపులకు 12 ఎకరాలు 12 వందల కోట్ల విలువైన భూములు కేటాయించారు.

విశాఖ బూములు ఏ స్థాయియిలో ఉన్నాయంటే,
రికార్డులు మార్చేస్తారు. తమవి కాని ప్రభుత్వ భూములకు తమ పేర్లతోనే పత్రాలు
సృష్టించి, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు, ఇక్కడి మంత్రులు, ఆ మంత్రి ఎవరో
నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ మనిషిని గంటా అని కూడా అంటారు. తనవి కాని
భూములను తనవే అని రికార్డులు సృష్టించి రుణాలు తీసుకున్న ఘనత ఆ మంత్రిదే .

ఇదే విశాఖను ఏ స్థాయిలో దోచుకుంటున్నారో
వేరే చెప్పనక్కర్లేదు. భోగాపురంలో ఎయిర్ పోర్టు అంటారు, మంత్రి అయ్యన్న భూములు,
ఎంపిల భూములను ముట్టుకోకుండా, పేదల భూములను లాక్కుంటారు.

ఇదే విశాఖలో భాగస్వామ్య సదస్సులు
పెడతారు. 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయిని చెపుతారు,
మీకైమైనా ఉద్యోగాలు వచ్చాయా చెప్పాలని ప్రజలనడిగితే లేదంటూ సమాధానమిచ్చారు.

ఆంధ్ర రాష్ట్రానికి సంవత్సరానికి 5 వేల
కోట్లు కూడా సగటున రాలేదని , నాలుగేళ్ల 20 వేల కోట్లు కూడా రాలేదని  కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెపుతుంటే, ఏకంగా 20
లక్షలు వచ్చాయంటూ పెద్దమనిషి మన అందరి చెవుల్లో పూలు పెడుతున్నారు.

మన అందరి చెవుల్లో పూలు పెట్టడానికి,
సదస్సుల నిర్వహణకు 3 రోజుల మీటింగ్ ల కోసం 150 కోట్లు ఖర్చు చేశారు. 150 కోట్లలో
కూడా 3 రోజుల తిండి బిల్లు 53 కోట్లు అంటే. అంటే ఏ స్థాయిలో దోచేస్తున్నారో అని
చెప్పడానికి ఇంతకంటే రుజువులు అవసరం లేదు.

ఇదే పెద్ద మనిషి చంద్రబాబు హయాంలో ఐటి
రంగం పరిస్థితి ఒకసారి గమనిస్తే, రాజశేఖరరెడ్డి గారి హయాంలోనే 10 ఏళ్ల క్రితమే 18
వేల మందికి ఉద్యోగాలు వస్తే, నాలుగున్నరేళ్ల కాలంలో పెరగాల్సింది పోయి, 16 వేలకు
పడిపోయాయి. ఇదే విశాఖ నగరంలో పదేళ్ల కాలంలో  ఐటి ఎక్స్ పోర్ట్సు 2 వేల కోట్లు ఉంటే పదేళ్లలో
పెరగాల్సింది పోయి, అవి ఏకంగా తగ్గిపోయి 1145 కోట్లకు తగ్గిపోయిన దుస్థితి ఉంది.
ఇదే విశాఖ నగరంలో విప్రో బిల్డింగ్ కనిపిస్తోంది. 5 వేల మందికి ఉపాథి కల్పించే ఆ
బిల్డింగ్ లో 250 మందికూడా పనిచేయడం లేదు. చంద్రబాబు హయాంలో విశాఖ పట్టణంలో ఐటి
స్పేస్ భవనాలు కట్టి 5.05 లక్షల ఎస్ ఎఫ్ టి అందుబాటులోఉంటే అందులో సుమారు 4 లక్షల
అడుగులకు స్థలం ఖాళీగా ఉన్నాయి. ఐటి రంగం దారుణంగా ఉంటే, ఐటి రంగం ఈ పెద్దమనిషి కళ్లు
ఆర్పకుండా అబద్దాలు చెపుతారు.

కంప్యూటర్ కూడా అబద్దాలు చెప్పపడం నేర్పుతారట.  విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఈ నినాదంతో
ప్రాణాలర్పించి తెప్పించుకుంటే, విశాఖ ఈయన హయాంలో నష్టాల్లో కూరుకుపోయిన సంగతి
తెలిసిందే. బిఐఎఫ్ ఆర్ కు పోకుండా వైయస్ఆర్ 12 వేల కోట్లతో విస్తరణ చేశారు.
చంద్రబాబు నాయుడు అడుగుపెట్టారు, వరుసగా 3 సంవత్సరాల నుంచి నష్టాలే, ఈ పెద్దమనిషి
లెగ్ అటువంటి, ఈ పెద్ద మనిషి అడుగుపెడితే ఏదైనా ధ్వంసం కావాల్సిందే.

పక్కనే విశాఖ పోర్టు కనిపిస్తోంది.
మొత్తం 12 బెర్తులు ప్రైవేటు పరం అయ్యాయి, 24 వేల మంది కార్మికులు పనిచేస్తున్న
పరిస్తఇతి నుంచి 4 వేల కు పడిపోయింది. ఏది ముట్టుకున్నా ప్రైవేటీకరణే.

చంద్రబాబుకు ముందు  విశాఖ కార్గొ హ్యాండ్లింగ్ లో దేశంలోనే నెం1
ఉంటే, దేశంలో 5 వ స్థానానికి దిగజారిపోయింది.

పోర్టులో కళాసీల జీతాలు పెంచాలని అడిగినా
పట్టించుకునే వారే లేరు. పోర్టు ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లు కూడా మూతపడటమే కాకుండా,
స్టాఫ్ క్వార్టర్లు శిథిలావస్థకు చేరుకోగా, ఆ 20 ఎకరాల బూములను తన బినామీలకు ఎలా
కట్టబెట్టాలన్నదానిపై స్కెచ్ లు వేస్తు్న్నారు.

విశాఖలో నాన్నగారి హయాంలో  హైదరబాద్ తరహాలో నిమ్స్ వంద ఎకరాల విస్తీర్ణంలో 250
కోట్లతో ఖర్చుతో  1130 పడకల ఆసుపత్రిలు 6
బ్లాకులు, 21 సూపర్ స్పెషాలటీల  చేపట్టారు.
ఆ మహానుభావుడు వెళ్లపోయినా ఆ విమ్స్ పరిస్థితి ఆరు బ్లాకుల నుంచి 2 కు తగ్గి,  డాక్టర్లను డిప్యూటేషన్ పై తీసుకుని వచ్చారు. కనీసం
కొత్తగా డాక్టర్లను రిక్రూట్ చేయాలన్న కనీసపు ఆలోచన కూడా ప్రభుత్వానకి లేదు.

కెజిహెచ్ 173 ఏళ్ల క్రితం కట్టిన గొప్ప
ఆసుపత్రి అందులో 1200 బెడ్ లు ఉంటే, 2 వేల మంది ఇన్ పేషెంట్ లుగా అడ్మిట్ అవుతున్నారు.
మంచానికి ఇద్దరు చొప్పున ఉన్నారు. కెజిహెచ్ లో డాక్టర్లు, నర్సులను రిక్రూట్
చేయరు. ప్రభుత్వ ఆసుపత్రులను దగ్గరుండీ నిర్వీర్యం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర 200
మంది చనిపోతే ప్రభుత్వం పట్టించుకోదు .

హుదుద్ తుఫానును జయించామని
చెప్పుకున్నా, 25 వేల ఇళ్లు దెబ్బతిన్ేనాయని నిర్దారిస్తే , ఇప్పటి వరకు 4 వేల
ఇళ్లు మాత్రమే కట్టారు. 5 ఏళ్లలో 35 వేల ఇళ్లను మహానేత చిరస్మరణీయుడయ్యారు. విశాఖ
లో ఏది జరిగినా స్కామే. విశాఖలో మీకు ఫ్లాట్లు కట్టిస్తారట. ఫ్లాట్ కట్టడానికి
అయ్యే ఖర్చు వెయ్యి రూపాయలు కూడా దాటదు. లంచాలు మెక్కి, 20 ఏళ్లు లబ్దిదారులు కడుతూ
పోవాలట. లంచాలు తీసుకునేది చంద్రబాబు నాయుడు గారు, ఆ మొత్తాన్ని కట్టాల్సింది
పేదలట. ఆ ప్లాట్లు ఇస్తే తీసుకోండి, బంగారంగా తీసుకోండి, మన అందరి ప్రభుత్వం
వస్తే, జగన్ అనే నేను మాట ఇస్తున్నా, ఆ ఫ్లాట్ల మీద అప్పును మొత్తం డబ్బాంతా మాఫీ
చేస్తాం.

పక్కనే పోర్టు కనిపిస్తున్నాయి, 15
కిలోమీటర్ల మేర కాలుష్యం వన్ టౌన్ లో ఉండాలంటే కాలుష్యం గురించి ఎవరూ
పట్టించుకోవడం లేదు. విశాఖ పరిస్థితి ఎలా ఉందంటే క్రైం రేటు 2015 ఏకంగా 16 హత్యలు
జరిగాయి. 2016 లో 29 హత్యలు 2017వో 27 హత్యలు 2018 లో ఇప్పటి వరకు 12 హత్యలు
జరిగాయంటే, ఏ స్థాయిలో మాఫియా సామ్రాజ్యం నడిపిస్తున్నారో ఇంతకంటే రుజువులేం కావాలి.

ఆంధ్ర యూనివర్శిటీ గొప్పతనం, దాని
పరిస్థఇతి 953 మంది 550 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు.
దగ్గరుండి, యూనివర్శీలను నీరు గారుస్తు్న్నారు. వసతులవ్వరు హాస్టళల్లు నిర్మించరు.
వారంతా గీతం యూనివర్శికీ పోయేట్లుగా నారాయణలు, గీతం యూనివర్శిటీలను తయారు
చేస్తున్నారు.

ఎక్కడెక్కడినుంచో విశాఖకు వచ్చే,
ఉద్యోగాలు, ఉపాథి, విద్య దొరుకుతుందనే బతకాలంటే ధరలు చూస్తే షాక్ కొట్టేట్లుగా
ఉన్నాయి కరెంటు ఛార్జీలు చూసుకుంటే బాదుడే...బాదుడే,,,పెట్రోలు డీజులు, ఇంటి
పన్నులు, బస్సు ఛార్జీలు, స్కూల్ ఫీజులు , కాలేజి ఫీజులు, చివరకు నీటి పన్ను
తీసుకున్న బాదుడే బాదుడు.

చంద్రబాబు హయాంలో ధరల బాదుతూ, పెట్రోలు
, డీజీలు పెరుగుతున్నాయట, కాంగ్రెస్ పార్టీ బంద్ కు పిలుపునిచ్చిందట, దానికి చంద్రబాబు
మద్దతు ఇవ్వడం చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు.

చుట్టుపక్కల ఏ రాష్ట్రంలోనూ లేని
విధంగా లీటరుకు 5,7 రూపాయల బాదుతుంటే, పక్క మన రాష్ట్రంలో 4 ఏళ్లుగా అధికంగా పన్నులు
బాదుతున్నాడు, వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ బంద్ కు
పిలుపునిచ్చిందట, టిడిపికి ఆహ్వానం పంపించిందట దానికి బాబు మద్దతిస్తాడట,ఇంతకంటే
దారుణం మరొటి ఉంటుందా

చంద్రబాబే దగ్గరుండి ధరల్ని పెంచుతారు,
వాటికి నిరసనగా బంద్ కు పాల్గొంటారట, దగ్గరుడి ప్రత్యేక హోదాను తూట్లు పొడుస్తారు
సంసారం అయిపోయిన తరువాత ధర్మ పోరాట దీక్ష అంటూ పోరాటం చేస్తారు. సొంత మామను వెన్నుపోటు
పొడిస్తారు, అదే ఎన్ టిఆర్ ఫోటోకు దండ వేసి ఎన్నికలకు పోతాడు. ఇదీ చంద్రబాబు నైజం.

విశాఖ డెయిరీని కూడా టిడిపి నాయకులు
ఆక్రమించేసి, కుటుంబ డెయిరీగా మార్చేశారు, కుటుంబ పాలన సాగిస్తున్నారు.

మన పిల్లలను చదివించలేని పరిస్థితుల్లో
మనం ఉన్నాం. టాక్సీ డ్రైవర్లు వచ్చి కలిశారు, టాక్సీలు కొనుకున్న తరువాత ఊబర్, ఓలా
అంటూ క్యాంపిటిషన్లు వస్తున్నాయి. సొంత ఆటో ఉన్న ప్రతి కార్మికుడుకి, టాక్సీ డ్రైవర్కు
కూడా సంవత్సరానికి 10 వేలు ఇస్తామని ప్రకటించారు.

అనంతరం పేదల చదువుల కోసం నవరత్నాల్లో
ఏం చేయనున్నారో వివరించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top