బాబు మోసం బట్టబయలు

నెల్లూరు: పార్లమెంట్‌ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం బయటపడిందని  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అంగీకారంతోనే ఏపీకి ప్యాకేజీ ఇచ్చామంటూ ప్రధాని నరేంద్ర మోడీ లోక్‌సభలో కుండబద్దలు కొట్టారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటాలు చేశారన్నారు. నాలుగేళ్లుగా యువభేరీలు, ధర్నాలు, బంద్‌లు, దీక్షల్లో చెబుతున్న విషయాన్ని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్‌ లోక్‌సభలో ఇంగ్లీష్‌లో చెప్పారని పేర్కొన్నారు. హోదాపై బాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎంపీలతో రాజీనామాలు చేయించాలన్న వైయస్‌ జగన్‌ మాటలకు సిద్ధపడాలన్నారు. 
Back to Top