చంద్రబాబుది రాజకీయ వ్యభిచారం

ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తిత్వం బాబుది
బీజేపీతో వైయస్‌ఆర్‌ సీపీ పొత్తు అంటూ దుష్ప్రచారం
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే వైయస్‌ఆర్‌ సీపీ బరిలోకి
వైయస్‌ఆర్‌ సీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి

అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ వ్యవభిచారం చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఏ ఎండకు ఆ గొడుపు పట్టే వ్యక్తిత్వం గలవాడన్నారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడిపి రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టుపెట్టారని మండిపడ్డారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని ఎన్డీయే నుంచి బయటకువచ్చి ప్రజలను మభ్యపెట్టేప్రయత్నం చేస్తున్నాడన్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చడంలో టీడీపీ, బీజేపీలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో వైయస్‌ఆర్‌ సీపీ పొత్తు పెట్టుకుంటుందని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎవరితో పొత్తుపెట్టుకోదని, ఒంటరిగానే బరిలోకి దిగుతుందన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ మద్దతు వల్లే టీడీపీ గెలిచిందన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు పార్టీకి డిపాజిట్లు కూడా రావన్నారు. 

రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు దమ్మూధైర్యం ఉంటే వెంటనే రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలని అనంత వెంకట్రామిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో వందల కొద్ది వాగ్ధానాలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని, బాబుకు ఓటు వేసి మోసపోయిన ప్రజలంతా ఆయనకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అదే విధంగా రాష్ట్రంలో టీడీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీల అవినీతి తీవ్రస్థాయిలో ఉందన్నారు. అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్‌ చేశారు.
Back to Top