బాబు అవినీతి వేలంపాటతో బట్టబయలు

నెల్లూరు: చంద్రబాబు ఎంత అవినీతి పరుడో వేలంపాట ద్వారా ఆంధ్రరాష్ట్ర ప్రజానికానికి అర్థం అవుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. సదావర్తి భూములకు సంబంధించి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో, బయట అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. సత్రం భూముల్లో అన్యాయం జరిగిందని నిజనిర్దారణ కమిటీ కూడా వేయడం జరిగిందన్నారు. సదావర్తి భూములకు రూ.22 కోట్లే ఎక్కవ అని మాట్లాడిన చంద్రబాబుకు వేలంపాటలో రూ.60.30 కోట్లకు కొనుగోలు చేయడం చెంపపెట్టులాంటిదన్నారు. చంద్రబాబు చేస్తున్న ప్రతి అవినీతి, అక్రమాలపై వైయస్‌ఆర్‌ సీపీ ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు. 


వేలంపాట చంద్రబాబుకు చెంపపెట్టు
సదావర్తి భూములను వేలంపాట నిర్వహించాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడం చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. చంద్రబాబు సదావర్తి భూములను ఎంత కారుచౌకకు కొట్టేశారో వేలంపాటను బట్టి అర్థం అవుతుందన్నారు. సదావర్తి భూముల్లో అన్యాయం జరిగిందని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టులను ఆశ్రయించి న్యాయపోరాటం చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు కోటరీ కొనుగోలు చేసినదానికంటే వేలంపాటలో మూడు రెట్లు అదనంగా రావడం వైయస్‌ఆర్‌ సీపీ విజయమన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, దళిత, దేవాలయ భూములను టీడీపీ నేతలు భూబకాసురుల్లా ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సదావర్తి లాంటి కుంభకోణాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయని, వాటిని ఆధారాలతో సహా భయటపెట్టడానికి వైయస్‌ఆర్‌ సీపీ ప్రయత్నిస్తుందన్నారు. ప్రభుత్వానికి భయపడి భూములు కాపాడుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ ఐవైఆర్‌ కృష్ణారావు సదావర్తి భూముల్లో కుంభకోణం జరిగిందని చెప్పారని గుర్తు చేశారు.
Back to Top