నువ్వు తప్పు చేసి ఇతరుపై రుద్దాలని చూస్తావా?


ఎవరు ఎక్కువ మోసం చేశారో తేల్చుకునేందుకే బీజేపీ, టీడీపీ లేఖలు
ప్రత్యేక హోదా కోసం మొదట్నుంచి పోరాడినట్లు టీడీపీ నటన
టీడీపీ నటన ముందు ఆస్కార్‌ అవార్డు దిగదుడుపే
ప్రధానికిచ్చిన లేఖలో హోదా ప్రస్తావని ఎందుకు తేలేదు
ఈశాన్య రాష్ట్రాలకు హోదా పొడిగించిన కమిటీలో బాబు సభ్యుడు!
అప్పుడైనా ఆంధ్రరాష్ట్రం గుర్తుకు రాలేదా చంద్రబాబూ
టీడీపీని రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు ప్రజలంతా సిద్ధం
నీ మోసాలు ఇంక సాగవు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి

హైదరాబాద్‌: చంద్రబాబుకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయా.. అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి ప్రశ్నించారు. తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై నిందలు వేస్తూ తప్పించుకోవాలని చూస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఎవరు ఎక్కువ మోసం చేశారో.. తేల్చుకునేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు లేఖలు రాసుకుంటున్నారని విమర్శించారు. ఇద్దరు మోసంలో పాత్రదారులేనని, ఇద్దరిలో ఏ1 ఎవరు.. ఏ2 ఎవరూ అనేది తేల్చుకోవాలని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను.. 29 సార్లు ఢిల్లీ వెళ్లివచ్చానని చంద్రబాబు చెబుతున్నాడని, అన్ని సార్లు ఢిల్లీ వెళ్లి ఏం సాధించాడో చెప్పాలని నిలదీశారు. ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ అసెంబ్లీ సాక్షిగా 2015లో హోదా ఇవ్వకపోతే కేంద్రంలో ఎందుకు కొనసాగుతున్నారు.. నెలలో హోదా సాధించలేకపోతే కేంద్రం నుంచి మంత్రులను విత్‌డ్రా చేసుకుంటారా అని ప్రశ్నించారని గుర్తు చేశారు. వాటికి సమాధానం చెప్పకుండా ప్రతిపక్షనేతను వ్యక్తిగతంగా కించపరిచే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అంతే కాకుండా మేం బయటకు వస్తే మీరు దూరుతారా అని నీచంగా మాట్లాడారన్నారు.
 
అబ్బా.. ఏం డ్రామాలు..

ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు చేసే నటన ఆస్కార్‌ అవార్డు వచ్చిన సినీనటులు కూడా చేయలేరని పార్థసారధి ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా పో రాటం చేసినట్లు.. సాధించలేకపోయామని ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్లుగా డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. జనవరి నెలలో చంద్రబాబు ప్రధానికి అందజేసిన లేఖలో స్పెషల్‌ కేటగిరి స్టేటస్‌ ఇవ్వాల్సిందేనని ఎక్కడ లేదన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు హోదా పొడిగించారు కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఎందుకు డిమాండ్‌ చేయలేదని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఈశాన్యరాష్ట్రాలకు హోదా పొడిగించాలనే కమిటీలో చంద్రబాబు కూడా ఒక సభ్యుడేనని, అప్పుడైనా రాష్ట్రం ఎందుకు గుర్తుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైయస్‌ఆర్‌ ఛాలెంజ్‌ విసిరి ముందుకెళ్లారు..

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన స్థానంలో ఉన్న చంద్రబాబు ఇతరులను నిందించడం ఎంత వరకు సమంసజం అని ప్రశ్నించారు. ఇవాల్టికి ప్రత్యేక హోదా కోసం మాట్లాడకుండా.. తన పాపాలు ఎక్కడ బయటపడిపోతాయోనని, సంవత్సరంలో ఎన్నికలు వస్తున్నాయనే హోదా అంటూ నటన మొదలు పెట్టారన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు మొదటి నుంచి చిత్తశుద్ధి లేదన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంతో మంది చివరకు చంద్రబాబుతో సహా ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ప్రయత్నించారని, అయినా వైయస్‌ఆర్‌ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎవరినీ నిందించకుండా ముందుకు వెళ్లారన్నారు. అదే స్ఫూర్తితో నా పరిపాలనకు ప్రజలే తీర్పు చెబుతారని 2009 ఎన్నికలకు ఛాలెంజ్‌ చేసి వెళ్లారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు తన తప్పులను ఇతరులపై తోయడానికి ప్రయత్నం చేస్తున్నాడన్నారు. 

 ఆంధ్రరాష్ట్రం నీ అబ్బ సొత్తు కాదు చంద్రబాబూ..

ఆంధ్రరాష్ట్ర చంద్రబాబు అబ్బ సొత్తు కాదని, ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల గడ్డ అని పార్థసారధి అన్నారు.  రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 2500 కోట్లు మంజూరు చేస్తే దాంతో చంద్రబాబు నిర్మించింది 6 లక్షల చదరపు అడుగులేనన్నారు. 3 లక్షల చదరపు అడుగులకు రూ. 180 కోట్లు ఖర్చు అవుతుంది. దాంట్లో రూ. వెయ్యి అవినీతికి పాల్పడిన రూ. 250 కోట్లు అవుతుందని, మిగిలిన డబ్బులు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ ఇస్తామరన్నారు. కానీ నాలుగేళ్లుగా రూ. 1050 కోట్లు మాత్రమే ఇచ్చారని పార్థసారధి చెప్పారు. వాటిని కూడా ఖర్చు పెట్టలేని దౌర్భాగ్యస్థితిలో రాష్ట్రం ప్రభుత్వం ఉందన్నారు. చంద్రబాబు ఇప్పటి వరకు రూ. 1.20 కోట్ల అప్పు చేశారని, దాంట్లో కనీసం రూ. వెయ్యి కోట్లు వెనుకబడిన ప్రాంతాలకు ఖర్చుపెట్టలేకపోయాడన్నారు. అదే విధంగా పోలవరం రూ. 33 వేల కోట్ల పునరావాసం ప్యాకేజీ గురించి మాట్లాడలేదని టీడీపీ అనడం దుర్మార్గమన్నారు. అనేక సార్లు అసెంబ్లీ, ప్రెస్‌మీట్‌లలో ప్రశ్నించలేదా చంద్రబాబూ అని నిలదీశారు. కేంద్రం రూ. 58 వేల కోట్లకు ఒప్పుకుందా.. లేదా అని ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదన్నారు. ఒప్పుకుందంటే వారి దోపిడీని అడ్డుకుంటామోననే భయంతో చెప్పలేదన్నారు. చంద్రబాబు పాలనంతా ప్రజల గమనిస్తున్నారని ఎప్పుడు రాష్ట్రం నుంచి తరిమికొడదామని ఎదురు చూస్తున్నారన్నారు. ఇంకా ప్రజలను మోసం చేయలేవు చంద్రబాబూ అని సూచించారు. 

తాజా వీడియోలు

Back to Top