రెయిన్‌గన్స్‌ కనుగొన్నట్లు బాబు బిల్డప్‌

ఎండిపోయిన వేరుశనగ పైర్లు పరిశీలించిన వైయస్‌ జగన్‌

అనంతపురం: పదేళ్లుగా అందుబాటులో ఉన్న రెయిన్‌గన్స్‌ వ్యవస్థను తానే కనుగొన్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు బిల్డప్‌ ఇస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం అనంతపురం జిల్లా గోరంట్ల పరిధిలో ఎండిపోయిన వేరుశనగ పైర్లను వైయస్‌ జగన్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వేరుశనగ పైరు ఎండిపోయిన తరువాత అనంతపురం జిల్లాలో సీఎం పర్యటించి గొప్పలు చెప్పడం బాధాకరమన్నారు. కేవలం  18 వేల ఎకరాల్లో పంట ఎండిపోయినట్లు తప్పుడు లెక్కలు తేల్చి ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సురెన్స్‌ ఎగ్గొట్టేందుకు హడావుడి చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోకుంటే ఉద్యమిస్తామని  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు.
 
Back to Top