జిల్లాకో సైకో సూదిగాళ్లను తయారుచేస్తున్నారు..!

జిల్లాకో సైకో సూదిగాళ్లను తయారుచేస్తున్నారు..!
మహిళలను వేధించిన వారికి ప్రమోషన్లు..!
అనంతపురంఃఆంధ్రప్రదేశ్ లో చంద్రన్న అరాచక పాలన సాగుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని... మహిళలను వేధించడమే లక్ష్యంగా టీడీపీ నేతలు పనిచేస్తున్నారని రోజా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు చంద్రబాబు జిల్లాకో సైకో సూదిగాళ్లను తయారుచేస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరపురంలో ధర్నా చేపట్టిన వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేయడంపై రోజా నిప్పులు చెరిగారు. 

మహిళలను వేధించిన వారికి ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చి చంద్రబాబు ఎంకరేజ్ చేస్తున్నారని రోజా ఆరోపించారు. రిషితేశ్వరి కేసును పక్కదోవ పట్టిస్తోన్న దేవినేని ఉమ, ధూలిపాళ్ల నరేంద్రలకు చంద్రబాబు అండగా నిలిచారు. వనజాక్షిపై దాడిచేసిన చింతమనేనికి చంద్రబాబు క్లీన్ చిట్ ఇచ్చారు. మహిళా ఎక్సైజ్ అధికారిణి వేధించిన అచ్చెన్నాయుడుకు మద్దతు పలికారు. ఓబులమ్మ, శాంతమ్మలను వేధించినందుకే పయ్యావులకు ఎమ్మెల్సీ ఇచ్చారని రోజా ఫైరయ్యారు. నారాయణ కాలేజీలో 11 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని  చనిపోతే మంత్రి నారాయణపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 
Back to Top